AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Prices Hike: సామాన్యులకు మరో షాక్.. సొంతింటి కల ఇక కలేనా.. ఆ ధరల్లో భారీ పెంపు?

ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న దేశంలోని సామాన్యులకు మరో చేదువార్త రాబోతోంది. రాబోయే కొద్ది రోజుల్లో మీరు కొత్త ఇల్లు నిర్మించాలని లేదా కొత్త ఇల్లు కొనాలని ఆలోచిస్తుంటే, మీరు తీవ్రమైన ఎదురుదెబ్బను ఎదుర్కోబోతున్నారనే అర్థం.

Home Prices Hike: సామాన్యులకు మరో షాక్.. సొంతింటి కల ఇక కలేనా.. ఆ ధరల్లో భారీ పెంపు?
Home Loan Emi
Venkata Chari
|

Updated on: Apr 22, 2022 | 5:14 PM

Share

ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న దేశంలోని సామాన్యులకు మరో చేదువార్త రాబోతోంది. రాబోయే కొద్ది రోజుల్లో మీరు కొత్త ఇల్లు నిర్మించాలని లేదా కొత్త ఇల్లు కొనాలని ఆలోచిస్తుంటే, మీరు తీవ్రమైన ఎదురుదెబ్బను ఎదుర్కోబోతున్నారనే అర్థం. ఒక వైపు ఇంటి నిర్మాణానికి ఉపయోగించే వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.. మరోవైపు గృహ రుణం(Home Loan) కూడా ఖరీదైనదిగా మరుతోంది. ఇది కాకుండా, కొన్ని ఇతర కారణాల వల్ల ఇల్లు కొనడం ఖరీదైనదిగా మారింది. రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంస్థ CREDAI ప్రకారం, త్వరలో ఇళ్ల ధరలు 10 నుంచి 15 శాతం పెరిగే ఛాన్స్ ఉంది. దీన్ని సింపుల్‌గా అర్థం చేసుకోవాలంటే ఈరోజు రూ.25 లక్షలు ఉన్న ఇల్లు, కొద్ది రోజుల తర్వాత అదే ఇంటి ధర రూ.27.50 లక్షల నుంచి రూ.28.75 లక్షలకు పెరుగుతుంది.

ఇల్లు కొనడం ఎందుకు ఖరీదైనది?

ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించే అన్ని వస్తువుల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. వీటిలో స్టీల్, సిమెంట్, ఇటుక, లేబర్ లాంటివి ఉన్నాయి. దీంతో పాటు దేశంలోని ప్రధాన బ్యాంకులు కూడా గృహ రుణాల ధరలను పెంచబోతున్నాయి. ఆ తర్వాత మీరు హోమ్ లోన్‌పై ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. గృహ రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఉపయోగించే EMI కూడా పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు, గతంలో కొన్ని ఇళ్లను విచ్చలవిడిగా విక్రయించారు. దీంతో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య బాగా తగ్గింది. ఇక్కడ అర్థం చేసుకోవలసిన పెద్ద విషయం ఏమిటంటే, గృహాల సరఫరాతో పోలిస్తే డిమాండ్ పెరిగింది. కారణం ఏదైనా సరే.. ధర పెరగడం వెనుక ఇది పెద్ద కారణంగా నిలిచింది.

గృహ ప్రాజెక్టులపై ద్రవ్యోల్బణం తీవ్రమైన ప్రభావం..

ప్రస్తుతం ఇళ్ల ధరలు 5 నుంచి 8 శాతం పెరిగాయని, మరో 5 నుంచి 7 శాతం పెరగాల్సి ఉందని క్రెడాయ్ అంచనా వేసింది. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని ఎదుర్కొంటున్న ఇలాంటి గృహనిర్మాణ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి. ఖరీదైన నిర్మాణ సామగ్రి కారణంగా చాలా ప్రాజెక్టులు ఆలస్యంగా లేదా నిలిచిపోతున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గించాలని బిల్డర్లు నిరంతరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోతే ప్రాజెక్టులు అసంపూర్తిగానే మిగిలిపోతాయని బిల్డర్లు చెబుతున్నారు. ఈ కారణాలన్నింటిని పరిశీలిస్తే, డిమాండ్ నిరంతరం పెరుగుతుండగా, గృహాల సరఫరా తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఇది గృహ కొనుగోలుదారులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుందనడంలో సందేహం లేదు. వారు మునుపటి కంటే చాలా ఎక్కువ ధర చెల్లించవలసి ఉంటుంది.

ఉక్కు ధర రెట్టింపు..

ఇళ్ల నిర్మాణంలో సిమెంట్‌, స్టీల్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇక సిమెంట్ ధరలను పరిశీలిస్తే గత కొన్ని నెలలుగా సిమెంట్ ధరలు రూ.100 పెరిగాయి. మరోవైపు ఉక్కు ధరలు కూడా భారీగా పెరిగాయి. మెట్రిక్ టన్ను రూ.45 వేలకు లభించే స్టీల్ ప్రస్తుతం రూ.90 వేలకు చేరింది. దీంతో సామాన్యుడి కలల ఇల్లు కలగానే మిగిలేలా పరిస్థితులు మారాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Multibagger Stock: లక్షను ఏడాదిలో రూ.8 లక్షలు చేసిన టాటా గ్రూప్ స్టాక్..

Swapping Policy: ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుదారులకు కేంద్ర సర్కార్‌ శుభవార్త.. ఏంటంటే..!