27 November, 2025
Subhash
భారత్ లో బుల్లెట్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతున్నట్లు మంత్రి త్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ఇప్పటికే అహ్మదాబాద్- ముంబై రూట్లో బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. 2027 వరకు ఈ మార్గంలో బుల్లెట్ రైలు అందుబాటులోకి రాబోతోంది.
పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. అదే సమయంలో దేశ వ్యాప్తంగా భవిష్యత్‌లో నిర్మించాల్సిన హైస్పీడ్ బుల్లెట్ రైలు మార్గాలపైనా ప్రణాళికలు సిద్దమవుతున్నాయి.
రానున్న రోజుల్లో బెంగళూరు- హైదరాబాద్ ను బుల్లెట్ రైలు కలుపబోతోంది. దీని వల్ల ప్రయాణికులకు ఎంతో మేలు జరగనుంది.
ఈ రెండు ముఖ్యమైన నగరాల మధ్య ప్రస్తుతం ప్రయాణ సమయం 19 గంటలు ఉండగా, ఈ రైలు అందుబాటులోకి వస్తే, కేవలం 2 గంటల్లో పూర్తి కానుంది.
ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ తరహాలో.. బెంగళూరు-హైదరాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ కోసం DPR రెడీ అవుతోంది.
మార్చి 2026 నాటికి రైల్వే బోర్డుకు దీనిని అందించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది.
బీఎస్‌ఎన్‌ఎల్ తక్కువ ధరల్లోనే అద్భుతమైన ప్లాన్స్‌ను అందిస్తోంది. చౌకైన ప్లాన్‌తో ఎక్కువ వ్యాలిడిటీ ఉండే ప్లాన్స్ ఉన్నాయి.