AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Take Home Salary: ఉద్యోగులకు భారీ షాక్.. తగ్గనున్న టేక్ హోమ్ శాలరీ.. కారణం ఏంటంటే?

కంపెనీలు తమ ఉద్యోగి, అతని కుటుంబానికి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌(Group Health Insurance)ను అందజేస్తాయని తెలిసిందే. దీనినే గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్(Term Insurance) అంటారు. చాలా కంపెనీలు ఈ సౌకర్యానికి బదులుగా ఉద్యోగి జీతం నుంచి కొంత భాగాన్ని..

Take Home Salary: ఉద్యోగులకు భారీ షాక్.. తగ్గనున్న టేక్ హోమ్ శాలరీ.. కారణం ఏంటంటే?
Insurance
Venkata Chari
|

Updated on: Apr 22, 2022 | 5:37 PM

Share

మీరు ఉద్యోగస్తులైతే, ఇది మీకు కీలకమైన వార్త. కంపెనీలు తమ ఉద్యోగి, అతని కుటుంబానికి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌(Group Health Insurance)ను అందజేస్తాయని తెలిసిందే. దీనినే గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్(Term Insurance) అంటారు. చాలా కంపెనీలు ఈ సౌకర్యానికి బదులుగా ఉద్యోగి జీతం నుంచి కొంత భాగాన్ని కూడా మినహాయించుకుంటాయి. జీ బిజినెస్ నివేదిక ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రూప్ ఇన్సూరెన్స్ కోసం మీ జేబుపై భారం పడనున్నట్లు తెలుస్తోంది. ఖరీదైన ప్రీమియం కారణంగా, మీరు ఈ సంవత్సరం గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్ కోసం అదనంగా 10-15 శాతం చెల్లించాల్సి రావచ్చనే వార్తలు వెలువడుతున్నాయి. చాలా కంపెనీలు గ్రూప్ ఇన్సూరెన్స్ కోసం తగ్గింపును పెంచడానికి సన్నాహాలు మొదలుపెట్టాయి.

వాస్తవానికి, కరోనా కారణంగా క్లెయిమ్స్ చాలా పెరిగాయి. ఇటువంటి పరిస్థితిలో, గ్రూప్ మెడిక్లెయిమ్ కోసం ప్రీమియం పెంచే ఒత్తిడి కూడా పెరిగింది. దీంతోపాటు వైద్య ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. ఈ అదనపు భారాన్ని తమ ఉద్యోగులతో పంచుకోవడం ద్వారా కంపెనీలు తగ్గించుకోవాలని నిర్ణయించుకుంటున్నాయి. గ్రూప్ ఇన్సూరెన్స్ వ్యాపారంలో 70 శాతం కంటే ఎక్కువ వాటా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సాధారణ బీమా కంపెనీలదే కావడం గమనార్హం.

గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఒకే కాంట్రాక్ట్ కింద గ్రూప్‌లోని ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. కంపెనీలు బీమా కంపెనీలతో ఒప్పందాలను కలిగి ఉంటాయి. ప్రతిగా కంపెనీలు తమ ఉద్యోగులకు బీమా రక్షణను అందిస్తాయి. ఈ సదుపాయానికి బదులుగా, కంపెనీలు తమ ఉద్యోగులకు అదనపు హామీ మొత్తాన్ని కొనుగోలు చేసే అవకాశం కూడా ఇస్తుంటాయి.

గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు తక్కువ..

ఉద్యోగి టర్మ్ ఇన్సూరెన్స్ కోసం ఎక్కువ చెల్లించాల్సి వస్తే, అతని టేక్ హోమ్ శాలరీ తగ్గుతుంది. గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రత్యేకత గురించి చెప్పాలంటే, వ్యక్తిగత పాలసీ కంటే దాని ప్రీమియం చౌకగా ఉంటుంది. ఈ బీమాను కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు. ఈ పాలసీకి ప్రీమియం చెల్లించడం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మీ జీతం నుంచి తీసుకుంటుంటారు. యజమానులే పాలసీ ప్రీమియం కడుతుంటారు. ప్రీమియం మొత్తం మీ జీతం నుంచి తీసుకోవడంతో, ఈ పాలసీలు ల్యాప్ అవ్వవు.

మీరు ఉద్యోగంలో ఉన్నంత కాలం బీమా..

గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్ కింద, ఒక ఉద్యోగి కంపెనీతో అనుబంధంగా ఉన్నంత కాలం బీమాను పొందుతూనే ఉంటాడు. ఉద్యోగం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ బీమా పనిచేయదు. కొన్నిసార్లు గ్రూప్ ఇన్సూరెన్స్‌లో టాప్-అప్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. అయితే, మీ వైద్య అవసరాలకు అనుగుణంగా దీన్ని మార్చడం సాధ్యం కాదు.

క్లెయిమ్ బోనస్ ప్రయోజనం లేదు..

గ్రూప్ ఇన్సూరెన్స్‌లో, మొత్తం సంవత్సరానికి క్లెయిమ్ చేయకుంటే నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనం అందుబాటులో ఉండదు. మరోవైపు, మీరు వ్యక్తిగత పాలసీని కొనుగోలు చేసి, క్లెయిమ్ చేయకుంటే, నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. తర్వాతి సంవత్సరానికి మీ ప్రీమియం మొత్తం తగ్గిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Home Prices Hike: సామాన్యులకు మరో షాక్.. సొంతింటి కల ఇక కలేనా.. ఆ ధరల్లో భారీ పెంపు?

Multibagger Stock: లక్షను ఏడాదిలో రూ.8 లక్షలు చేసిన టాటా గ్రూప్ స్టాక్..