AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇకపై లైసెన్స్, ఆర్‌సీ అవసరమే లేదు.. ఈ ఒక్కటి మీ దగ్గరుంటే చాలు..

డ్రైవింగ్ చేయడానికి రోడ్డుపైకి వెళ్తుంటే.. తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిసిందే. డ్రైవర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే కాకుండా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), పొల్యూషన్ సర్టిఫికేట్ (PUC Certificate), వాహన బీమా పత్రాలు..

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇకపై లైసెన్స్, ఆర్‌సీ అవసరమే లేదు.. ఈ ఒక్కటి మీ దగ్గరుంటే చాలు..
Vehicle Registration Certificate
Venkata Chari
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 22, 2022 | 8:27 PM

Share

డ్రైవింగ్ చేయడానికి రోడ్డుపైకి వెళ్తుంటే.. తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిసిందే. డ్రైవర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే కాకుండా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), పొల్యూషన్ సర్టిఫికేట్ (PUC Certificate), వాహన బీమా పత్రాలు వంటి అన్ని ఇతర అవసరమైన పత్రాలను కలిగి ఉండటం తప్పనిసరి అని తెలిసిందే. మీ వద్ద ఈ పత్రాలు ఏవీ లేకుంటే, మీపై చట్టపరమైన చర్య తీసుకుంటారు. దీంతో మీరు భారీ జరిమానా చెల్లించవలసి ఉంటుంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ వద్ద ఈ పత్రాలు లేకపోతే, మీరు రూ 2000 నుంచి రూ 5000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ పత్రాలన్నీ మీ దగ్గర ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే ఈ రోజు మనం అలాంటి మొబైల్ యాప్ గురించి తెలుసుకుందాం. దీంతో మీ దగ్గర లైసెన్స్-RC లేకపోయినా చలాన్ వేయరు.

ఈ రెండు మొబైల్ యాప్‌లతో అన్ని సమస్యలకు చెక్..

వాస్తవానికి, డిజిటల్ ఇండియా ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకుని, అవసరమైన అన్ని పత్రాలను ఒకే చోట సురక్షితంగా ఉంచడానికి భారత ప్రభుత్వం DigiLocker, mParivahan మొబైల్ యాప్‌లను రూపొందించింది. ఈ రెండు యాప్‌లలో, మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పొల్యూషన్ సర్టిఫికేట్, బీమా పత్రాలను అప్‌లోడ్ చేయవచ్చు. అవసరమైనప్పుడు ఎప్పుడైనా, ఎక్కడైనా ఉపయోగించవచ్చు.

ఈ మొబైల్ యాప్ దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది. దీనిలో స్టోర్ చేసిన పత్రాల సాఫ్ట్ కాపీ హార్డ్ కాపీగా ఆమోదించనున్నారు. కాబట్టి, మీరు డిజిలాకర్ లేదా mParivahan యాప్‌ని కలిగి ఉంటే.. అవసరమైన అన్ని పత్రాలను అందులో నిల్వ చేస్తే, మీరు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నిర్భయంగా డ్రైవ్ చేయవచ్చు. పోలీసులు మీకు చలాన్‌ వేసే అవకాశం లేదు.

డిజిలాకర్, ట్రాన్స్‌పోర్ట్ యాప్ ప్రయోజనాలు..

డిజిలాకర్, mParivahan యాప్‌లతో అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. అన్నింటిలో మొదటిది, మీరు డ్రైవ్‌కు వెళ్లేటప్పుడు మీ పత్రాలను మరచిపోతే, ఈ యాప్‌లో ఉంచిన డాక్యుమెంట్‌ల సాఫ్ట్ కాపీని చూపడం ద్వారా జరిమానా నుంచి తప్పించుకోవచ్చు. రెండవ ప్రయోజనం ఏమిటంటే, ఈ యాప్‌ల సహాయంతో, మీరు మీతో ‘మూవింగ్ షాప్ ఆఫ్ డాక్యుమెంట్స్’ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కనీసం 4 పత్రాలు అవసరం. వీటిలో లైసెన్స్, ఆర్‌సీని సులభంగా వాలెట్‌లో ఉంచుకోవచ్చు. కానీ బీమా, పొల్యూషన్ పేపర్‌లు ఎక్కువ వాడుతుండడం వల్ల పాడైపోయినందున వాలెట్‌లో ఉంచలేం.

సాధారణంగా కారు డ్రైవర్లు ఈ పత్రాలన్నింటినీ తమ కారులో ఉంచుకోవడం వల్ల వారికి ఎలాంటి సమస్య ఉండదని గమనించవచ్చు. కానీ, ద్విచక్ర వాహన చోదకులు ఒకేసారి ఇన్ని పత్రాలను తీసుకెళ్లడం చాలా సవాలుగా మారుతుంది. ఇటువంటి పరిస్థితిలో, డిజిలాకర్, mParivahan యాప్‌లు వారికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

మరిన్ని ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Take Home Salary: ఉద్యోగులకు భారీ షాక్.. తగ్గనున్న టేక్ హోమ్ శాలరీ.. కారణం ఏంటంటే?

Home Prices Hike: సామాన్యులకు మరో షాక్.. సొంతింటి కల ఇక కలేనా.. ఆ ధరల్లో భారీ పెంపు?