BEL Recruitment 2022: డిప్లొమా, ఐటీఐ చేసినవారికి సువర్ణవకాశం.. ఇంకా 8 రోజులే మిగిలి ఉన్నాయి..!
BEL Recruitment 2022: నిరుద్యోగులకి శుభవార్త. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నుంచి జాబ్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ రిక్రూట్‌మెంట్‌కు అర్హత,
BEL Recruitment 2022: నిరుద్యోగులకి శుభవార్త. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నుంచి జాబ్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ రిక్రూట్‌మెంట్‌కు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. చివరి తేదీ 30 ఏప్రిల్ 2022గా నిర్ణయించారు. ఇంకా 8 రోజులే మిగిలి ఉన్నాయి. దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ముందుగా bel-india.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి BEL ట్రైనీ ఇంజినీరింగ్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులని భర్తీ చేస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద మొత్తం 91 పోస్టులు భర్తీ చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు ఒకసారి నోటిఫికేషన్ చదివితే మంచిది. అనర్హుల దరఖాస్తులని తిరస్కరిస్తారు. అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకుంటే బెటర్. ఎందుకంటే చివరి నిమిషంలో సర్వర్ బిజీగా ఉండవచ్చు.
మొత్తం ఖాళీల సంఖ్య: 91
పోస్టుల వివరాలు: ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ- 66, టెక్నీషియన్-25 పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు.
అర్హతలు: ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్) మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పే స్కేల్: నెలకు రూ.24,500ల నుంచి రూ.90,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
టెక్నీషియన్ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో (ఎలక్ట్రానిక్ మెకానికల్, ఫిట్టర్, ఎలక్ట్రికల్, మిల్లర్, ఎలక్ట్రోప్లేటర్) ఐటీఐతోపాటు, ఎస్‌ఎస్‌ఎల్‌టీ, అప్రెంటిస్‌షిప్ ట్రైనీగా ఏడాది చేసి ఉండాలి. పే స్కేల్: నెలకు రూ.21,500ల నుంచి రూ.82,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2022.
మరిన్ని జాబ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి