ECIL Recruitment: బీటెక్ చేసిన వారికి గుడ్ న్యూస్.. హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. శిక్షణలోనే రూ. 50 వేలు..
ECIL Recruitment: హైదరాబాద్ ప్రధానకేంద్రంగా పనిచేసే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. భారత ప్రభుత్వ అనుశక్తి విభాగానికి చెందిన ఈ సంస్థలో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రెయినీ పోస్టులను...
ECIL Recruitment: హైదరాబాద్ ప్రధానకేంద్రంగా పనిచేసే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. భారత ప్రభుత్వ అనుశక్తి విభాగానికి చెందిన ఈ సంస్థలో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా 40 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఈసీసీ (21), మెకానికల్ (10), సీఎస్‌ఈ (09) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఈసీఈ, మెకానికల్, సీఎస్‌ఈ సబ్జెక్టుల్లో ఫుల్ టైం బీఈ/ బీటెక్ పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు గేట్-2022 వ్యాలిడ్ స్కోర్ కలిగి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 14-05-2022 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను గేట్-2022 మెరిట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలోనే నెలకు రూ. 54,880 చెల్లిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 23-04-2022న ప్రారంభంకాగా, చివరి తేదీగా 14-05-2022ని నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ట్వీట్‌కు పగలబడి నవ్విన సమంత.. అసలేం జరిగిందంటే..
Home Loan: హోమ్ లోన్ OD ఎంత ప్రయోజనకరమో తెలుసా?.. వడ్డీ ఖర్చు తగ్గించుకోవచ్చా..
Bank OD: పర్సనల్ లోన్ కంటే.. ఓవర్‌డ్రాఫ్ట్ ఉపయోగరమా..? ఎందుకంటే..