Higher Education: ఇకపై ఆ డిగ్రీలు చెల్లవు.. షాకింగ్ న్యూస్ చెప్పిన యూజీసీ, ఏఐసీటీఈ..!
పాకిస్తాన్‌లో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు షాకింగ్ న్యూస్. ఇకపై భారతదేశంలో ఉన్నత విద్యా ఆడ్మిషన్లు గానీ, ఉపాధి అవకాశాలు గానీ ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
National UGC: పాకిస్తాన్(Pakistan)లో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు షాకింగ్ న్యూస్. ఇకపై భారతదేశంలో ఉన్నత విద్యా ఆడ్మిషన్లు గానీ, ఉపాధి అవకాశాలు గానీ ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్(UGC), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(AICTE) తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. పాకిస్తాన్‌లో తీసుకున్న విద్యా డిగ్రీకి భారతదేశంలో ఉన్నత విద్యలో ప్రవేశం లభించదని తేల్చి చెప్పింది. అలాగే, అటువంటి విద్యార్థులు ఉపాధి అవకాశాలకు అర్హులుగా పరిగణించమని పేర్కొంది. భారత విద్యార్థులందరూ ఉన్నత విద్యను అభ్యసించడానికి పాకిస్తాన్‌కు వెళ్లవద్దని కేంద్ర ఉన్నత విద్యా మండలి సూచించింది.
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లేందుకు విద్యార్థుల మధ్య తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఉన్నత విద్య కోసం పాకిస్తాన్‌కు వెళ్లే వారిపై ఆంక్షలు విధించింది. భారతీయులతో సహా విదేశీ విద్యార్థులందరినీ హెచ్చరించింది. పాకిస్తాన్ చదువుకున్న డిగ్రీ ఇక్కడ చెల్లదు. అయితే, భారత పౌరసత్వం పొందిన వారి పిల్లలు ఉన్నత విద్య డిగ్రీలు పూర్తి చేస్తే.. తప్పనిసరిగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం తర్వాత ఉద్యోగాలకు చెల్లుబాటు అవుతాయి.
UGC & AICTE has advised students not to travel to Pakistan for pursuing higher education. pic.twitter.com/L1vl5XmotQ
— ANI (@ANI) April 23, 2022
అయితే, పాకిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చే శరణార్థులు, వారి పిల్లలకు భారత పౌరసత్వం ఈ పరిమితి నుండి మినహాయించింది. పాకిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చే శరణార్థులు, భారత పౌరసత్వం ఉన్న వారి బిడ్డకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) నుండి భద్రతా క్లియరెన్స్ లభించినట్లయితే వారికి భారతదేశంలో ఉపాధి అవకాశాలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం పాకిస్తాన్‌కు వెళ్లకుండా ఉండాలని స్పష్టంగా సూచించారు.
పాకిస్తాన్‌లోని ఉన్నత విద్యాసంస్థలు భారతీయ విద్యార్థులను ఆకర్షించడానికి వివిధ ప్రోత్సాహకాలను అందిస్తున్న తరుణంలో UGC, AICTE భారతీయ విద్యార్థులను, ముఖ్యంగా విదేశీ భారతీయ విద్యార్థులను హెచ్చరించాయి. విద్యార్థులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అడ్మిషన్ తీసుకునేటప్పుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని యూజీసీ కోరింది. విశేషమేమిటంటే, ఉన్నత విద్యకు సంబంధించిన రెగ్యులేటర్లు ఇద్దరూ దీనికి సంబంధించి పబ్లిక్ నోటీసు కూడా జారీ చేశారు. పాకిస్తాన్ డిగ్రీల ఆధారంగా దేశంలోని మరే ఇతర కోర్సులో ప్రవేశం పొందబోరని లేదా ఉద్యోగాలు మొదలైన వాటిలో వారి డిగ్రీలు చెల్లుబాటు కావని రెగ్యులేటర్లు ఇద్దరూ పబ్లిక్ ఇన్ఫర్మేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.
శేషమేమిటంటే, ప్రతి సంవత్సరం దేశం నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతున్నారు. ఈ సమయంలో, విద్యార్థుల దృష్టి ప్రపంచంలోని అటువంటి దేశాల వైపు ఎక్కువగా ఉంటుంది. అక్కడ వారు తమ బడ్జెట్‌లో ప్రవేశం పొందుతారు. అలాగే, జీవన వ్యయం, ఆహారం ఖర్చులు కూడా తక్కువ.
Read Also… Jammu Terror Attack: సుంజ్వాన్‌లోని CISF జవాన్ల బస్సుపై ఉగ్రవాద దాడి.. వీడియో విడుదల చేసిన అధికారులు