Viral Video: ఉత్తరప్రదేశ్‌లో వింత ఘటన.. తాను చనిపోయానంటూ 200 మందిని.. మహిళ ఫిర్యాదుతో సీన్ రివర్స్
మాట్రిమోనీ సైట్ పేరుతో 200 మందికిపైగా యువతులకు టోకరా పెట్టాడు ఓ కేటుగాడు. కరోనా లాక్‌డౌన్ టైమ్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు . మంచి సంబంధాలు కుదుర్చుతానంటూ అనేకమంది యువతులకు వల వేశాడు.
మాట్రిమోనీ సైట్ పేరుతో 200 మందికిపైగా యువతులకు టోకరా పెట్టాడు ఓ కేటుగాడు. కరోనా లాక్‌డౌన్ టైమ్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు . మంచి సంబంధాలు కుదుర్చుతానంటూ అనేకమంది యువతులకు వల వేశాడు. అసలు కథ ఇప్పుడే మెుదలైంది.. వివాహం చేసుకోవాలనుకునే వారికి జాతక దోషాలు ఉన్నాయని, అవి సరిచేసేందుకు పూజలు చేయిస్తానని నమ్మబలికి వారి నుంచి భారీగా డబ్బు వసూలు చేసేవాడు. డబ్బులు తన ఖాతాలో పడగానే ఇంక వారి కాల్స్ కు స్పందించేవాడు కాదు. డబ్బులు ఇచ్చిన బాధితులు ఒత్తిడి చేస్తే వారి నుంచి తప్పించుకునేందుకు తాను చనిపోయినట్లు నాటకం ఆడేవాడు. సోషల్ మీడియా, వెబ్సైట్లలో తన ప్రొఫైల్ ఫొటోను మార్చేసేవాడు. చనిపోయాడని నమ్మించడానికి దండ వేసి ఉన్న ఫొటోను పెట్టేవాడు. దీంతో చాలా మంది యువతులు అది నిజమేననుకుని నిందితుడిని వదిలేశారు. అయితే ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీ జిల్లాకు చెందిన ఓ యువతి చేసిన ఫిర్యాదుతో సీన్ రివర్స్ అయింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. నిందితుడిని గజియాబాద్‌కు చెందిన తరుణ్ కుమార్‌గా గుర్తించారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..
Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్ అవుతున్న చింపు..
Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!

