Health News: ఈ భయంకరమైన వ్యాధికి వ్యాక్సిన్‌ వచ్చి100 ఏళ్లు దాటింది.. అయినా టెన్షన్ టెన్షన్..!

Health News: క్షయవ్యాధి అత్యంత ప్రాణాంతకమైన అంటువ్యాధులలో ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ప్రతి సంవత్సరం

Health News: ఈ భయంకరమైన వ్యాధికి వ్యాక్సిన్‌ వచ్చి100 ఏళ్లు దాటింది.. అయినా టెన్షన్ టెన్షన్..!
Tb
Follow us
uppula Raju

|

Updated on: Apr 22, 2022 | 5:14 PM

Health News: క్షయవ్యాధి అత్యంత ప్రాణాంతకమైన అంటువ్యాధులలో ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ప్రతి సంవత్సరం TB వల్ల 1.5 మిలియన్ల కంటే ఎక్కువ మంది చనిపోతున్నారు. మంచి విషయం ఏంటంటే దీనిని నివారించడానికి మార్కెట్లో టీకా (BCG) అందుబాటులో ఉంది. అయితే టీబీ వ్యాక్సిన్ వచ్చి ఇప్పటికే 100 ఏళ్లు దాటింది. దీని సామర్థ్యం కూడా తగ్గిపోయిందనేది నిపుణుల వాదన. ఆస్ట్రేలియాలోని జేమ్స్ కుక్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు, ఆరోగ్య నిపుణులు తమ పరిశోధనా పత్రాలలో ఒక విషయాన్ని నొక్కి చెప్పారు. TB వ్యాక్సిన్ కనుగొని 100 సంవత్సరాలు గడిచాయని కాబట్టి కొత్త వ్యాక్సిన్‌ను కనుగొనే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. వారి ప్రకారం TB అనేది అత్యంత ప్రమాదకరమైన అంటు వ్యాధులలో ఒకటి. ప్రస్తుత టీకా కూడా గొప్ప రక్షణను అందిస్తుంది. అయితే దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి.

క్షయవ్యాధి (TB) అనేది మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల సోకుంతుంది. దీని కారణంగా ఏటా దాదాపు 15 లక్షల మంది చనిపోతున్నారు. ఈ వ్యాధికి చికిత్స అంటే యాంటీబయాటిక్స్‌తో నెలల తరబడి ఇంటెన్సివ్ థెరపీ చేయడం. TBతో బాధపడే వ్యక్తులు దగ్గినప్పుడు రక్తం బయటికి వస్తుంది. అలాగే జ్వరం, చలి, బరువు తగ్గుతారు. అయితే లైసెన్స్ పొందిన ఏకైక TB వ్యాక్సిన్ BCG (Bacilli calmetre-gurin). దీనిని జూలై 1921లో కనుగొన్నారు. ఈ వ్యాక్సిన్ లక్షలాది మంది ప్రాణాలను కాపాడింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ టీకా రక్షణ సామర్థ్యం కాలక్రమేణా తగ్గింది. పల్మనరీ TB నుంచి రక్షించడంలో BCG విఫలమవుతుంది. అందుకే TB కోసం కొత్త వ్యాక్సిన్‌లను కనుగొనడం చాలా ముఖ్యమని నిపుణులు భావిస్తున్నారు.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Health News: మీలో ఈ లక్షణాలుంటే కిడ్నీలు డేంజర్‌లో ఉన్నట్లే.. కచ్చితంగా తెలుసుకోండి..!

Farmers: రైతులకి గమనిక.. ఎండాకాలం పశువుల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Health Tips: పెరుగు తింటే బాడీలో యూరిక్‌ యాసిడ్‌ పెరుగుతుందా..!