Health Tips: వేసవిలో వీటిని రాత్రంతా నానబెట్టి తింటే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.. అవెంటో తెలుసా..

రోజు రోజుకీ ఎండలు మండిపోతున్నాయి. పగలు బయటకు వెళ్లేమందు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.

Health Tips: వేసవిలో వీటిని రాత్రంతా నానబెట్టి తింటే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.. అవెంటో తెలుసా..
Health
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 22, 2022 | 5:31 PM

రోజు రోజుకీ ఎండలు మండిపోతున్నాయి. పగలు బయటకు వెళ్లేమందు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అయితే వేసవిలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. శరీరాన్ని హైడ్రేట్‏గా ఉంచుకునేందుకు అవసరమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి. వేసవిలో అనారోగ్య సమస్యలు మరింత వేధిస్తుంటాయి. కానీ.. మన ఇంట్లో ఉండే ఆహార పదార్థాలు ఇన్ఫెక్షన్లు, అనారోగ్య సమస్యలు తగ్గించేందుకు సహాయపడతాయి. ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలను రాత్రంతా నానబెట్టి తీసుకోవడం ద్వారా పోషకవిలువలు మరింత పెరుగుతాయి. అంతేకాకుండా.. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. అవెంటో తెలుసుకుందామా.

మెంతులు.. మెంతికూరలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రేగులను శుభ్రపరుస్తుంది. మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహయపడతాయి.. మెంతికూరను రోజూ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. డయాబెటిక్ రోగులకు మెంతులు ఔషదంగా పనిచేస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి తీసుకోవడం వలన పీరియడ్స్ సమయంలో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

గసగసాలు.. జీవక్రియను పెంచడంలో, బరువు తగ్గించడంలో గసగసాలు సహాయపడతాయి. రాత్రంతా నానబెట్టిన గసగసాలు తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరగదు.

అవిసె గింజలు.. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు అవిసె గింజల్లో పుష్కలంగా ఉంటాయి. చేపలను తినడానికి ఇష్టపడని వారు అవిసె గింజలు తీసుకోవచ్చు. నానబెట్టిన అవిసె గింజలు అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారికి చాలా మంచిది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అవిసె గింజలో డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

ఎండుద్రాక్ష.. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. నానబెట్టిన ఎండు ద్రాక్షను రోజూ తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాలను తగ్గిస్తుంది. చర్మ సమస్యలను తగ్గించడమే కాకుండా.. మచ్చలను తగ్గిస్తుంది. రక్తహీనత, కిడ్నీ స్టోన్ సమస్యలు ఉన్నవారు నానబెట్టిన ఎండుద్రాక్షను తీసుకోవడం మంచిది.

పచ్చి పెసర్లు.. నానబెట్టిన పెసర్లలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. అలాగే పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వల్ల అధిక రక్తపోటు ఉన్న రోగులకు ఇది మంచిది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

గమనిక:- ఈ కథనం కేవలం నిపుణుల సూచనలు..ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని టీవీ 9 తెలుగు దృవీకరించలేదు. అమలు చేయడానికి ముందు వైద్యులను సంప్రదించాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Jersey Movie: జెర్సీ సినిమాపై ప్రశంసలు కురిపించిన న్యాచురల్ స్టార్.. మీ మంచి మనసే కారణమంటూ స్టార్ హీరో రిప్లై..

Neha Shetty: మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన ‘డీజే టిల్లు’ రాధిక.. కార్తికేయ సరసన నేహా శెట్టి..

Prabhas: మార్షల్ ఆర్ట్స్ వస్తే ప్రభాస్ సినిమాలో నటించే ఛాన్స్.. అనౌన్స్ చేసిన మేకర్స్.. ఏ మూవీలో తెలుసా..

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ ట్వీట్‌కు పగలబడి నవ్విన సమంత.. అసలేం జరిగిందంటే..