AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: మార్షల్ ఆర్ట్స్ వస్తే ప్రభాస్ సినిమాలో నటించే ఛాన్స్.. అనౌన్స్ చేసిన మేకర్స్.. ఏ మూవీలో తెలుసా..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన రాధేశ్యామ్ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న

Prabhas: మార్షల్ ఆర్ట్స్ వస్తే ప్రభాస్ సినిమాలో నటించే ఛాన్స్.. అనౌన్స్ చేసిన మేకర్స్.. ఏ మూవీలో తెలుసా..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Apr 22, 2022 | 2:37 PM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన రాధేశ్యామ్ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీకి ఎక్కువగా నెగిటివ్ టాక్ వచ్చింది. మరోవైపు.. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతోపాటు.. సలార్.. స్పిరిట్.. ప్రాజెక్ట్ కే చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇవే కాకుండా.. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలోనూ ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ప్రభాస్ సినిమాలో నటించేందుకు ఆహ్వానం పలుకుతున్నారు ప్రాజెక్ట్ మేకర్స్. డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కిస్తున్నారు. ఇందులో నటించేందుకు ఆసక్తి ఉన్నవారి కోసం ఎదురుచూస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

మార్షల్ ఆర్ట్స్ ‏లో టాలెంట్ ఉన్నవారు.. పార్కౌట్ ప్లేయర్స్, న్యూ ఏజ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ వంటివి వచ్చినవారు ప్రభాస్ సినిమాలో నటించవచ్చని తెలియజేశారు. ఆసక్తి ఉన్నవారు.. projectkstunt@gmail.com అడ్ర‌స్‌కి మెయిల్ చేయాలని తెలిపారు. గతంలోనూ ఈ సినిమాలో నటించేందుకు పలు విభాగాల్లో నటించేందుకు ప్రకటన ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‎తో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దిపీకా పదుకొణె కథనాయికగా నటిస్తుండగా.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Also Read: Mike Tyson: అభిమాని అత్యుత్సాహం.. చితక్కొట్టిన మైక్ టైసన్.. వీడియో వైరల్

F3 Movie: ‘ఎఫ్ 3’ నుంచి మరోసాంగ్.. కుర్రకారును కిర్రెక్కిస్తున్న ‘ఊ..ఆ..ఆహా..ఆహా’ పాట

Acharya: మెగాస్టార్ సినిమాకు సూపర్ స్టార్ మాట సాయం.. క్లారిటీ ఇచ్చిన కొరటాల

Johnny Depp: మాజీ భార్యపై రూ. 380 కోట్ల పరువునష్టం దావా వేసిన స్టార్ హీరో..

Follow Us
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే