F3 Movie: ‘ఎఫ్ 3’ నుంచి మరోసాంగ్.. కుర్రకారును కిర్రెక్కిస్తున్న ‘ఊ..ఆ..ఆహా..ఆహా’ పాట

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఎఫ్ 3. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్స్ గా నటించారు.

F3 Movie: 'ఎఫ్ 3' నుంచి మరోసాంగ్.. కుర్రకారును కిర్రెక్కిస్తున్న ‘ఊ..ఆ..ఆహా..ఆహా’ పాట
F3
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 22, 2022 | 12:19 PM

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఎఫ్ 3. వెంకటేష్(Venkatesh), వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్స్ గా నటించారు. గతంలో వచ్చిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘F3’ థీమ్ సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. సినిమా ప్రధాన తారాగణం అంతా కనిపించిన ఈ పాట కోసం దేవి శ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ ట్యూన్ ని కంపోజ్ చేశారు. సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌ లలో భాగంగా నేడు (ఏప్రిల్ 22న)చిత్ర యూనిట్ సెకెండ్ సింగిల్ ‘ఊ.. ఆ.. ఆహా.. ఆహా..’ పాటని విడుదల చేశారు.

కలర్ఫుల్ అండ్ గ్లామరస్ గా ఉన్న ఈ పాటతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దేవీ శ్రీ. క్యాచీ లిరిక్స్‌తో ఈ పాట చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. ఈ పాటలో తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహన్ తమ అందాలతో ఆకట్టుకున్నారు. ఇక వెంకటేష్, వరుణ్ తేజ్ జోష్ ఫుల్ మాసీ డ్యాన్సులతో సందడి చేశారు. అలాగే సునీల్ తన ట్రేడ్ మార్క్ స్టెప్స్ తో అదరగొట్టేశాడు. ఇక ఈ పాట లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కనిపించడం విశేషం. షూటింగ్ సమయంలో బన్నీ సెట్ కు వచ్చిన విజువల్స్ ను పాట మధ్యలో చూపించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చేశారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, సునీల్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలలో కనిపిస్తుండగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పార్టీ సాంగ్ లో సందడి చేయనుంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Johnny Depp: మాజీ భార్యపై రూ. 380 కోట్ల పరువునష్టం దావా వేసిన స్టార్ హీరో..

Tollywood : మాస్ దర్శకులంతా తమ సినిమాల్లో ఈ ఎలిమెంట్స్‌ ఎలా మిస్ అవుతున్నారబ్బా.!!

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ మీద గుస్సాగా ఉన్న మెగా ఫ్యాన్స్.. కారణం ఇదే..

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?