Johnny Depp: మాజీ భార్యపై రూ. 380 కోట్ల పరువునష్టం దావా వేసిన స్టార్ హీరో..

పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్ లు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాలీవుడ్ స్టార్ హీరో జానీ డెప్(Johnny Depp)ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు.

Johnny Depp: మాజీ భార్యపై రూ. 380 కోట్ల పరువునష్టం దావా వేసిన స్టార్ హీరో..
Johnny Depp Amber Heard
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 22, 2022 | 11:22 AM

పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్ లు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాలీవుడ్ స్టార్ హీరో జానీ డెప్(Johnny Depp)ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. జాక్ స్పారో పాత్రలో జానీ డెప్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ స్టార్ హీరో ఇప్పుడు తన మాజీ భార్య పై భారీ పరువు నష్టందావా వేశారు. నటి అంబర్ హెర్డ్ ను మూడేళ్ళ డేటింగ్ అనంతరం 2015లో జానీ డెప్ రెండో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్ళైన ఏడాదికి ఈ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అయితే జానీ డెప్ తో విడిపోయిన తర్వాత కూడా తను గృహహింసకు గురయ్యానంటూ అంబర్ హెర్డ్ వాషింగ్టన్ పోస్ట్ కథనం రాశారు. దీనిని వ్యతిరేకిస్తూ జానీ డెప్ కోర్టును ఆశ్రయించారు.

తన మాజీ భార్యపై రూ. 380 కోట్లకు పరువునష్టం దావా వేశారు. ప్రస్తుతం ఈ కేసు వర్జీనియా కోర్టులో కొనసాగుతోంది. “నేను ఇంటి నుండి బయలుదేరడానికి చాలాసార్లు ప్రయత్నించినప్పుడు.. ఆమె నన్ను సెక్యూరిటీ గార్డులతో కలిసి ఎలివేటర్ వద్ద ఆపి ఏడుస్తూ.. అరుస్తూ..“నువ్వు లేకుండా నేను జీవించలేను. నేను చనిపోతాను. కానీ నువ్వు బయటికి రావాలి“ అని అడిగేదని జానీ ఆరోపించాడు. అంతే కాదు అర్ధరాత్రి ఇంటి పైకి వస్తువులు విసిరేసేదంట చెప్పుకొచ్చాడు. అలాగే అసభ్యకరమైన మాటలతో తనను వేధిస్తూ, మానసిక వేదనకు గురి చేసేదని తెలిపారు. వైన్ గ్లాస్, టీవీ రిమోట్ తన తలపైకి విసిరేదని, ఇష్టం వచ్చినట్టు వ్యవహరించేదని చెప్పారు. బెడ్ పై మలం ఉంచేదని జానీ చెప్పుకొచ్చారు. దీనికి  సంబంధించి బుధవారం కోర్టులో సాక్ష్యమిచ్చారు జానీ డెప్. ఈ కేసు విచారణ వాయిదాపడింది. వచ్చే వారం తిరిగి విచారణ కొనసాగనుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

KGF 2: జక్కన్న ఆర్ఆర్ఆర్ టార్గెట్‏ను చేసిన కేజీఎఫ్.. ఎట్టకేలకు రికార్డ్ క్రాస్ చేసిందిగా..

KGF Chapter 2: కేజీఎఫ్ రియల్ రాఖీభాయ్ ఎవరో తెలుసా ?.. కోలార్ మైన్స్ హీరో ఇతడే..