KGF Chapter 2: కేజీఎఫ్ రియల్ రాఖీభాయ్ ఎవరో తెలుసా ?.. కోలార్ మైన్స్ హీరో ఇతడే..

కేజీఎఫ్‌(KGF 2) ఇప్పుడిది సినిమా కాదు సెన్సేషన్. వరల్డ్ వైడ్ కలెక్షన్లను కొల్లగొడుతూ బాక్సాఫీస్ దుమ్ము లేపుతున్న ప్రశాంత్ నీల్ క్రియేషన్.

KGF Chapter 2: కేజీఎఫ్ రియల్ రాఖీభాయ్ ఎవరో తెలుసా ?.. కోలార్ మైన్స్ హీరో ఇతడే..
Kgf 2
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 21, 2022 | 8:46 PM

కేజీఎఫ్‌(KGF 2) ఇప్పుడిది సినిమా కాదు సెన్సేషన్. వరల్డ్ వైడ్ కలెక్షన్లను కొల్లగొడుతూ బాక్సాఫీస్ దుమ్ము లేపుతున్న ప్రశాంత్ నీల్ క్రియేషన్. విడుదలైన వారం రోజుల్లోనే దాదాపు 600 కోట్లకు పైగా సాధించి ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ సైతం బ్రేక్ చేసింది. ప్రస్తుతం దేశమంతా కేజీఎఫ్ 2 మేనియా కొనసాగుతుంది. ఈ సినిమాకు రికార్డ్స్ స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతుంది. యశ్ నటనకు.. ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లే కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.. ఫిల్మీ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటున్న రాఖీభాయ్‌ ఎమోషన్. అయితే ఈ క్రియేషన్, ఆ ఎమోషన్ వాళ్లవేం కాదనే న్యూస్ ప్రస్తుతం అందర్నీ అయ్యేలా చేస్తోంది అటెక్షన్. ఎస్ ! ప్రశాంత్ నీల్ ప్రస్టేజియస్‌ గా రాసుకొని మరీ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమా తన కొడుకు కథే అంటోంది.. ఓ తల్లి. అనడమే కాదు… ప్రశాంత్‌ నీల్ పై ఫైర్ కూడా అవుతోంది.

కర్ణాటక చెందిన థంగం అనే వ్యక్తి కరుడు కట్టిన నేరస్థుడు. 1990ల్లో పేరుపోయిన వాడు. కోలార్ గనుల్లో పనిచేస్తూనే ఓ గ్యాంగ్ ని మెయిన్‌టెన్ చేస్తూ… బంగార్ని కొల్లగొట్టేవాడు. మైన్ నిర్వాహకులు అడ్డొస్తే క్రూరంగా దాడి చేసేవాడు. అలా కొట్టేసిన బంగారాన్ని జనాలకు కూడా పంచుతూ జూనియర్ వీరప్పన్ గా పేరు కూడా తెచ్చుకున్నాడు. చివరికి 1997లో తిరుపతిలో పోలీసుల చేతిలో ఎన్ కౌంటర్ అయ్యాడు. 25 ఏళ్ల థంగం.. బంగారం దోపిడీలకు పెట్టింది పేరు. నాలుగేళ్లలో థంగంపై 42 దోపిడీ కేసులు నమోదయ్యాయి. కానీ ప్రజలు మాత్రం అతడికి మద్దతు ఇస్తుండేవారు. అయితే ఇదే థంగం జీవిత కథ ఆధారంగానే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమా తీశాడని ప్రస్తుతం ఆరోపిస్తోంది అతడి తల్లి పాలీ. ఆరోపించడమే కాదు… దీనిపై చట్ట పరంగా ముందుకు వెళతానని కూడా చెబుతోంది. తన కొడుకును సినిమాలో నెగిటివ్‌గా చూపించారని ఆమె ఆరోపించారు. అంతేకాదు.. తన కొడుకు జీవితాన్ని సినిమాగా తీసేముందు అనుమతి తీసుకోలేదని అంటుంది. అయితే ప్రశాంత్ నీల్ మాత్రం ఇది కల్పిత కథే అని మరో సారి గట్టిగా చెబుతున్నాడు. కోలార్ గనుల గురించి తెలుసుకుని ఈ కథను అల్లానని క్లారిటీ ఇస్తున్నాడు.

Thangam

Thangam

Also Read:  Nelson Dileep Kumar: రజినీతో బీస్ట్ డైరెక్టర్ సినిమా క్యాన్సిల్ కాలేదు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ నెల్సన్..

Samantha : విజయ్ దేవరకొండతో సామ్ సినిమా.. ఘనంగా మూవీ లాంచ్.. ఎక్కడా కనిపించని హీరోయిన్.. ఎందుకంటే..

Kajal Aggarwal: బిడ్డ పుట్టాక కాజల్ భావోద్వేగ పోస్ట్.. కష్టమంతా మర్చిపోయానంటూ..

RRR OTT: ఇక ఓటీటీ వంతు.. డిజిటల్‌ స్క్రీన్‌పై ట్రిపులార్‌ సందడి చేసేది ఆ రోజే.. ఎప్పుడు, ఎక్కడా.?