KGF 2: జక్కన్న ఆర్ఆర్ఆర్ టార్గెట్‌ను చేసిన కేజీఎఫ్.. ఎట్టకేలకు రికార్డ్ క్రాస్ చేసిందిగా..
సినిమా స్టోరీ విషయంలో ... బడ్జెట్ విషయంలో... మేకింగ్ విషయంలో... కలెక్షన్స్ టార్గెట్ విషయంలో పిచ్చ క్లారిటీ గా ఉండే రాజమౌళి..
సినిమా స్టోరీ విషయంలో … బడ్జెట్ విషయంలో… మేకింగ్ విషయంలో… కలెక్షన్స్ టార్గెట్ విషయంలో పిచ్చ క్లారిటీ గా ఉండే రాజమౌళి.. ఈ సారి తడబడ్డాడు. తను చేసుకున్న ప్లానింగ్ పై కాప్రమైజ్ అయ్యాడు. ఫైనల్ గా కేజీఎఫ్ చేతుల్లోకి ట్రిపుల్ ఆర్ ను నెట్టి… పెట్టుకున్న టార్గెట్ కు దూరమయ్యాడు. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టును అనౌన్స్ చేసిన టైంలోనే బాహుబలి కలెక్షన్లకు రెంట్టింపు కలెక్షన్లు కొడతాననే కాన్ఫిడెన్స్ ను అందరికీ చూపించాడు రాజమౌళి. చెప్పినట్టే భారీ బడ్జెట్‌తో లావిష్ గా సినిమాను తెరకెక్కించాడు. చెర్రీ- తారక్ టాలెంట్‌ను మాక్సిమమ్ వాడుకుని… పాన్ ఇండియా లెవల్లో ట్రిపుల్ ఆర్ కు తిరిగులేదనే ఫీల్‌ను కలిగించాడు.
కాని కరోనా కారణంగా … రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ అవడంతో… తన ప్లాన్స్ అండ్ ప్రమోషన్ స్ట్రాటజీస్ ను కూడా మార్చుతూ వచ్చారు రాజమౌళి. ఈ క్రమంలోనే రెండు మూడు సార్లు రిలీజ్ డేట్‌ను మార్చి… ఫిల్మీ లవర్స్‌కు ఇరిటేషన్ కలిగించాడు. అయితే ట్రిపుల్ ఆర్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కారణమో… ప్రొడ్యూసర్ ప్రెషరే కారణమో… తెలియదు కాని… మొత్తానికి ట్రిపుల్ ఆర్ సినిమాను మార్చ్ 25న రిలీజ్ చేశాడు జక్కన్న. రిలీజ్ అయితే చేశాడు కాని… ఆ నెక్ట్స్ మంత్ రిలీజ్ అయ్యే కేజీఎఫ్ చాప్టర్ 2 గురించి మాత్రం ఆలోచించలేకపోయాడు. ఆ సినిమా తెచ్చే వేవ్‌ను గెస్ చేయలేకపోయాడు. ఆ సినిమా వల్ల తన సినిమా పై కలిగే ఇంపాక్ట్ ను థింక్ చేయలేక పోయాడు. ప్రెషర్ కారణంగా రిలీజ్ డేట్‌నే కాదు… ట్రిపుల్ ఆర్ సాధిస్తుందనుకున్న కలెక్షన్ టార్గెట్ ను కూడా కాంప్రమైజ్ అయ్యాడు మన జక్కన్న. విడుదలైన వారంలోనే రూ. 700 కోట్లు సాధించి ఆర్ఆర్ఆర్ రికార్డ్ బద్దలు కొట్టింది కేజీఎఫ్ 2.
Samantha : విజయ్ దేవరకొండతో సామ్ సినిమా.. ఘనంగా మూవీ లాంచ్.. ఎక్కడా కనిపించని హీరోయిన్.. ఎందుకంటే..
Kajal Aggarwal: బిడ్డ పుట్టాక కాజల్ భావోద్వేగ పోస్ట్.. కష్టమంతా మర్చిపోయానంటూ..
RRR OTT: ఇక ఓటీటీ వంతు.. డిజిటల్ స్క్రీన్‌పై ట్రిపులార్ సందడి చేసేది ఆ రోజే.. ఎప్పుడు, ఎక్కడా.?