AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nelson Dileep Kumar: రజినీతో బీస్ట్ డైరెక్టర్ సినిమా క్యాన్సిల్ కాలేదు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ నెల్సన్..

తమిళ్ స్టార్ హీరో విజయ్ తలపతి(Vijay Thalapathy).. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dileep Kumar) కాంబోలో తెరకెక్కిన లేటేస్ట్ చిత్రం బీస్ట్.

Nelson Dileep Kumar: రజినీతో బీస్ట్ డైరెక్టర్ సినిమా క్యాన్సిల్ కాలేదు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ నెల్సన్..
Rajini
Rajitha Chanti
|

Updated on: Apr 21, 2022 | 4:11 PM

Share

తమిళ్ స్టార్ హీరో విజయ్ తలపతి(Vijay Thalapathy).. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dileep Kumar) కాంబోలో తెరకెక్కిన లేటేస్ట్ చిత్రం బీస్ట్. ఏప్రిల్ 13న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఓవైపు బీస్ట్ మూవీ సూపర్ హిట్ అంటూ కొందరు రివ్యూ ఇవ్వగా.. మరికొందరు మాత్రం బాలేదంటూ కుండ బద్దలుకొట్టేశారు. ఇక చెన్నైలో పలు చోట్ల సినిమా నచ్చకపోవడంతో.. థియటర్ స్క్రీన్లకు నిప్పు పెట్టి రచ్చ చేశారు విజయ్ ఫ్యాన్స్. సినిమాతో విజయ్.. పూజా హెగ్డే నటనతో మెప్పించారని.. కానీ డైరెక్టర్ మూవీని సరిగ్గా తెరకెక్కించలేకపోయారంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇటీవల విజయ్ తలపతి తండ్రి డైరెక్టర్ చంద్రశేఖర్ సైతం బీస్ట్ సినిమా డైరెక్టర్ నెల్సన్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేవలం విజయ్ స్టార్ డమ్ వల్లే సినిమా హిట్ అయ్యిందని.. స్క్రీన్ ప్లే.. విజువల్స్ ఎఫెక్ట్ బాలేదంటూ తెల్చీ చెప్పాడు. ఉగ్రవాద సంస్థలు.. రా ఏజెంట్ వంటి అంశాలను ఎంచుకున్నప్పుడు డైరెక్టర్ మ్యాజిక్ చేయ్యొచ్చని.. కానీ నెల్సన్ అదేం పట్టించుకోలేదంటూ చెప్పుకొచ్చాడు. దీంతో డైరెక్టర్ నెల్సన్ పై మరింత వ్యతిరేకత ఏర్పడింది.

అయితే ఈ క్రమంలోనే డైరెక్టర్ నెల్సన్ కుమార్ తన తదుపరి సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్‏తో చేయాల్సి ఉంది. బీస్ట్ సినిమా డిజాస్టర్ కావడంతో రజినీ, నెల్సన్ కాంబో మూవీ క్యాన్సిల్ అయ్యిందంటూ టాక్ నడుస్తోంది. బీస్ట్ సినిమా అనుకున్నంత హిట్ కాకపోవడంతో.. రజినీ తన తలైవ 169 సినిమాకు దర్శకుడిని మార్చే ఆలోచనలో ఉన్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా పుకార్లపై క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. తన ట్విట్టర్ ఖాతా ప్రోఫైల్ లో తలైవర్ 169ను జత చేశాడు. దీంతో నెల్సన్ తదుపరి సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్‏తో అని స్పష్టం చేశాడు.

Nelson

Nelson

Also Read:  RRR OTT: ఇక ఓటీటీ వంతు.. డిజిటల్‌ స్క్రీన్‌పై ట్రిపులార్‌ సందడి చేసేది ఆ రోజే.. ఎప్పుడు, ఎక్కడా.?

Neha Shetty: సోషల్ మీడియాను రఫ్ఫాడిస్తున్న డీజే టిల్లు బ్యూటీ.. నేహా ఫోజులకు ఫిదా అవుతున్న కుర్రకారు

Priyanka Chopra-Nick Jonas : ప్రియాంక చోప్రా – నిక్ జోనస్ గారాల పట్టి పేరేంటో తెలుసా?

Mahesh Babu: ఆచార్య మూవీలో సూపర్ స్టార్ సర్‌ప్రైజ్ ఎంట్రీ.. మెగా మూవీ కోసం మహేష్ ఇలా..