Mahesh Babu: ఆచార్య మూవీలో సూపర్ స్టార్ సర్‌ప్రైజ్ ఎంట్రీ.. మెగా మూవీ కోసం మహేష్ ఇలా..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)కలిసి నటిస్తున్న సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Mahesh Babu: ఆచార్య మూవీలో సూపర్ స్టార్ సర్‌ప్రైజ్ ఎంట్రీ.. మెగా మూవీ కోసం మహేష్ ఇలా..
Acharya
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 21, 2022 | 11:58 AM

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)కలిసి నటిస్తున్న సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో చిరు చరణ్ ఇద్దరూ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. సమ్మర్ కానుకగా ఈ సినిమా ఏపిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అటు ఇప్పటివరకు విడుదలైన మెగాస్టార్ లుక్స్ ప్రేక్షకులను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం సినిమాకు హైలైట్ గా ఉండనున్నాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయినా ట్రైలర్ సినిమా పై అంచనాలను ఆకాశానికెత్తేశాయి. ఇప్పుడిప్పుడు మెగాస్టార్ ను మెగాపవర్ స్టార్ ను కలిపి తెరపై చూస్తామా అని మెగా అభిమానులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సినిమాకు సంబంధించిన చిన్న విషయం కూడా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్ లో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని అంటున్నారు. మహేష్ వాయిస్ తో ఈ సినిమా మొదలవుతుందట.. హీరోల క్యారెక్టర్స్ ను మహేష్ వాయిస్ పరిచయం చేస్తుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియదు కానీ.. అటు మెగా అభిమానులు, ఇటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ న్యూస్ తెలిసి తెగ ఖుష్ అవుతున్నారు. గతంలో మహేష్ బాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా , తారక్ నటించిన బాద్షా సినిమాలకు వాయిస్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి మహేష్ తన వాయిస్ ఓవర్ తో ఆచార్య సినిమాకు మరింత మైలేజ్ ఇవ్వనున్నారని అంటున్నారు. కొరటాల శివ మహేష్ కు మంచి సన్నిహితుడు ఆయనతో రెండు సూపర్ హిట్స్ అందుకున్నాడు మహేష్. మరో వైపు రామ్ చరణ్ మహేష్ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే..

మరిన్ని ఇక్కడ చదవండి : 

F3 Movie: ఎఫ్ 3 సింగిల్ సాంగ్‏కు భారీ రెస్పాన్స్.. గంటల్లోనే మిలియన్ వ్యూస్..

Viral Photo: క్యూట్ చూపులతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి యూత్ ఫెవరేట్.. అమ్మడు ఆ పేరుతో చాలా స్పెషలండోయ్.. గుర్తుపట్టండి..

Ante Sundaraniki: నజ్రియా ఎవరి ఫోన్లు ఎత్తలేదు.. కానీ అందుకు థ్యాంక్స్.. హీరో నాని ఆసక్తికర కామెంట్స్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!