AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

F3 Movie: ఎఫ్ 3 సింగిల్ సాంగ్‏కు భారీ రెస్పాన్స్.. గంటల్లోనే మిలియన్ వ్యూస్..

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం ఎఫ్ 3 (f3). డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.

F3 Movie: ఎఫ్ 3 సింగిల్ సాంగ్‏కు భారీ రెస్పాన్స్.. గంటల్లోనే మిలియన్ వ్యూస్..
F3
Rajitha Chanti
|

Updated on: Apr 20, 2022 | 9:29 PM

Share

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం ఎఫ్ 3 (f3). డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా… తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘F3’ థీమ్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. సినిమా ప్రధాన తారాగణం అంతా కనిపించిన ఈ పాట కోసం దేవి శ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ ట్యూన్ ని కంపోజ్ చేశారు. సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌ లలో భాగంగా ఏప్రిల్ 22న చిత్ర యూనిట్ సెకెండ్ సింగిల్ ‘వూ.. ఆ.. ఆహా.. ఆహా..ఆహా’ పాటని విడుదల చేయనుంది.

తాజాగా ‘వూ.. ఆ.. ఆహా.. ఆహా..ఆహా’ పాట ప్రోమోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. కలర్ఫుల్ అండ్ గ్లామరస్ గా డిజైన్ చేసిన ఈ ప్రోమో క్షణాల్లో వైరల్ గా మారింది. విడుదల చేసిన కొద్దిసేపటికే మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ..ఈ ప్రోమోలో జోష్ ఫుల్ మాసీ డ్యాన్సులతో సందడి చేస్తూ కనిపించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాట కోసం మరో చార్ట్ బస్టర్ ట్యూన్ కంపోజ్ చేశారని ప్రోమో చూస్తే అర్ధమౌతుంది. ప్రోమో చివర్లో సునీల్ తన ట్రేడ్ మార్క్ స్టెప్ తో కనిపించడం పాటపై ఇంకా ఆసక్తిని పెంచింది. ఏప్రిల్ 22న పూర్తి పాటని చిత్ర యూనిట్ విడుదల చేస్తుంది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, సునీల్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలలో కనిపిస్తుండగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పార్టీ సాంగ్ లో సందడి చేయనుంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి సహా నిర్మాత.

Also Read: Ashokavanamlo Arjuna Kalyanam: ముప్పై ఏళ్ళు దాటిన అర్జునుడి పెళ్లి కష్టాలు.. ఆకట్టుకుంటున్న

అశోకవనంలో అర్జున కళ్యాణం ట్రైలర్..

KGF Chapter 2: ఇదెక్కడి మాస్ మావ.. అంత పవర్‌ఫుల్ డైలాగ్‌ను ఇలా వాడేశారేంట్రా..!

Gangubai Kathiawadi: ఓటీటీలో సందడి చేయనున్న గంగూబాయి.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..