Vijay Devarakonda – Samantha: షురూ అయిన విజయ్ దేవరకొండ – సమంతల ప్రేమకథ..
ఒట్టేసి ఒక మాట.. ఒట్టెయ్యకుండా ఒక మాట చెప్పను.. మాటంటే మాటే.. అని గట్టిగా నిలబడాలంటే సినిమాల్లో కుదరని పని. కాలంతో పాటు అభిరుచులు మారడం..
ఒట్టేసి ఒక మాట.. ఒట్టెయ్యకుండా ఒక మాట చెప్పను.. మాటంటే మాటే.. అని గట్టిగా నిలబడాలంటే సినిమాల్లో కుదరని పని. కాలంతో పాటు అభిరుచులు మారడం.. వాటికి తగ్గట్టు ప్లాన్‌బీలు, ప్లాన్‌సీలు అమల్లో పెట్టడం తప్పదు. ప్రస్తుతం రౌడీ హీరో కూడా లైట్ తీస్కో రాజా అంటూ ఫ్లోతో పాటే నడుస్తున్నారు. ఇట్స్ మై కెరీర్.. అంటూ ఇన్‌స్టంట్‌గా డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఇదే నా చివరి లవ్ స్టోరీ.. అంటూ వరల్డ్ ఫేమస్ లవర్ ప్రమోషన్లో బిగ్గరగా సౌండిచ్చిన విజయ్ దేవరకొండ(Vijay Devarakonda).. అప్పటినుంచి వెనక్కు తిరిగి చూడదల్చుకోలేదు. పూరి జగన్నాథ్ క్యాంప్‌లో చేరి సడన్‌గా పర్‌ఫెక్ట్ యాక్షన్ అండ్ పేట్రియాటిక్ సబ్జెక్ట్‌తో బిగ్ టర్న్ తీసుకున్నారు. లైగర్ మూవీ రిలీజ్ కాకముందే పాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌కి చాలా దగ్గరగా వచ్చేశారు.
లైగర్ ప్రొడక్షన్ స్టేజ్‌లో వుండగానే దాదాపు అదే జానర్‌తో.. అదే పూరీ కాంపౌండ్‌లో జనగణమన ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పేశారు. నెక్ట్స్ పంద్రాగస్టుకి వస్తున్నా అని రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు. కానీ.. ఈ రెండూ సిమిలర్ ఫ్లేవర్స్ కావడంతో కెరీర్‌లో వేరియేషన్ చూపించాల్సిన ఎమర్జెన్సీ సిట్యువేషన్ వచ్చేసింది. అందుకే.. లవ్‌యూ రౌడీస్ అంటూ ఫ్యాన్స్‌ని రొమాంటిక్‌గా కన్నుగీటేశారు. అప్పుడెప్పుడో తాను మాటిచ్చిన శివనిర్వాణకు కబురు పంపేశారు లైగర్ స్టార్. టక్ జగదీష్ తర్వాత లీజర్‌గా వున్న శివ.. ఆ గ్యాప్‌లోనే మాంచి ప్రేమ కథ రాసిపెట్టి రౌడీ హీరో డేట్స్ రాగానే.. లెటజ్ గో అనేశారు. సమంతను హీరోయిన్‌గా కన్ఫమ్ చేసి.. ఖుషీ అనే టైటిల్‌ని అనుకున్నారు. తాజాగా ఈ సినిమా పూజాకార్యక్రమాలు హైదరాబాద్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ అతిథిగా హాజరయ్యారు. మైత్రి మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. 23 నుంచి కాశ్మీర్‌లో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరపనున్నారు. ఇలా అర్జున్‌రెడ్డి తాజా మజిలీ చకచకా ముందుకెళ్లబోతోంది. సో.. ఒట్టు తీసి గట్టు మీద పెట్టి గట్టిగా ప్రేమ పాఠాలు షురూ చేస్తున్నారన్నమాట మన డియర్ కామ్రేడ్. త్వరలోనే ఈ సినిమానుంచి అదిరిపోయే అప్డేట్ రానుందని టాక్ వినిపిస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :