AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF Chapter 2: “నాకెవ్వడి దోస్తీ అక్కర్లేదు.. నాతో దుష్మని ఎవ్వడూ తట్టుకోలేడు”.. బాలీవుడ్‌లో రాకీభాయ్ హవా..

ఓవర్‌నైట్‌లో స్టార్‌డమ్ వస్తే.. బర్నింగ్ స్టార్ అనీ సడన్‌ స్టార్‌ అనీ ఇన్‌స్టంట్‌గా ఓ ట్యాగ్ తగిలించేసి పక్కన పెట్టేస్తాం. కానీ... ఇప్పుడు ఎమర్జ్ అయిన కేజీఎఫ్‌ స్టార్‌ని మాత్రం అలా లైట్ తీసుకునే పరిస్థితి లేదు.

KGF Chapter 2: నాకెవ్వడి దోస్తీ అక్కర్లేదు.. నాతో దుష్మని ఎవ్వడూ తట్టుకోలేడు.. బాలీవుడ్‌లో రాకీభాయ్ హవా..
Yash
Rajeev Rayala
|

Updated on: Apr 21, 2022 | 9:41 AM

Share

ఓవర్‌నైట్‌లో స్టార్‌డమ్ వస్తే.. బర్నింగ్ స్టార్ అనీ సడన్‌ స్టార్‌ అనీ ఇన్‌స్టంట్‌గా ఓ ట్యాగ్ తగిలించేసి పక్కన పెట్టేస్తాం. కానీ.. ఇప్పుడు ఎమర్జ్ అయిన కేజీఎఫ్‌(KGF) స్టార్‌ని మాత్రం అలా లైట్ తీసుకునే పరిస్థితి లేదు. నార్త్‌లో ఆ హీరో రేంజ్ ఎంతంటే చెప్పడానికి మాటలు సరిపోవడం లేదట. ఏం కావాలిరా నీకు అంటే.. దునియా అంటాడు కేజీఎఫ్‌ ఫస్ట్‌పార్ట్‌లో రాకీభాయ్. ముంబై మీ అబ్బదనుకుంటున్నావా..? అంటే.. ఔన్రా.. అని అతడన్నట్టే ఔతోందిప్పుడు. కేజీఎఫ్‌ సెకండ్ చాప్టర్ రిలీజయ్యాక.. ముంబై ఫిలిమ్ సర్కిల్స్‌లో వణుకు మొదలైంది. ఏకంగా దంగల్ లైఫ్ టైమ్ బిజినెస్‌ని టార్గెట్ చేసి దూసుకుపోతోంది కేజీఎఫ్2. ఇప్పటికే హిందీ వెర్షన్ లో ఈ సినిమా  250 కోట్ల మార్కును దాటేసింది. చాలా వేగంగానే 300 కోట్ల మార్కును అందుకునే అవకాశాలు కూడా ఫుల్లుగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.

లాంగ్‌ రన్‌లో ఇంకా ఏయే రికార్డులు బద్దలవుతాయో తెలీదు గాని, రాకీభాయ్‌కొస్తున్న క్రేజ్ మాత్రం అంచనాలకు అందడం లేదు. ఇద్దరు హీరోలతో జక్కన్న తీసిన ట్రిపులార్ క్రేజ్‌తో పోలిస్తే, సోలోగా విక్టరీ కొట్టిన యష్‌నే గ్రేట్‌గా చెప్పుకుంటోంది బీటౌన్ ఇండస్ట్రీ. యష్‌కి యాంగ్రీ యంగ్‌మాన్‌ అనే ట్యాగ్ ఇవ్వడమే కాదు.. ఏకంగా బిగ్‌బీతో పోల్చేశారు కంగనా రనౌత్. ఎయిటీస్‌లో అమితాబ్‌ బచ్చన్‌ని చూసినట్టు.. ఇప్పుడు యష్‌ని చూస్తున్నారు అంటూ హిందీ ఆడియన్స్ తరఫున స్టేట్‌మెంట్ ఇచ్చారామె. కొన్ని దశాబ్దాలుగా ఇండియా మిస్సయిన ఒరిజినల్ హీరో దొరికాడు అంటూ ఈ ఫైర్‌బ్రాండ్ చేసిన ట్వీట్ ఇప్పుడు నేషనల్ ట్రెండింగ్ లైన్. కంగనానే కాదు చాలా మంది బాలీవుడ్ స్టార్ యష్ ను సూపర్ హీరో అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. ఓ కన్నడ హీరో బాలీవుడ్‌లో ఈ రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకోవడం నిజంగానే గ్రేట్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

F3 Movie: ఎఫ్ 3 సింగిల్ సాంగ్‏కు భారీ రెస్పాన్స్.. గంటల్లోనే మిలియన్ వ్యూస్..

Viral Photo: క్యూట్ చూపులతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి యూత్ ఫెవరేట్.. అమ్మడు ఆ పేరుతో చాలా స్పెషలండోయ్.. గుర్తుపట్టండి..

Ante Sundaraniki: నజ్రియా ఎవరి ఫోన్లు ఎత్తలేదు.. కానీ అందుకు థ్యాంక్స్.. హీరో నాని ఆసక్తికర కామెంట్స్..