Kota Srinivasa Rao: నా అభిమాన హీరోయిన్ ఆమే .. ఆసక్తికర విషయం చెప్పిన కోట శ్రీనివాసరావు
టాలీవుడ్ లో ఒకప్పుడు విలన్ గా నటించి ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు. ఆయన చేసిన పాత్రలను ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేరు.
టాలీవుడ్ లో ఒకప్పుడు విలన్ గా నటించి ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు(Kota Srinivasa Rao). ఆయన చేసిన పాత్రలను ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేరు. ఎన్నో వందల సినిమాల్లో నటించి మెప్పించారు కోట. ఇక కోట శ్రీనివాసరావు , బాబు మోహన్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ గా భయపెట్టలన్నా.. కమెడియన్ గా నవ్వించాలన్నా .. తండ్రి పాత్రలో ఎమోషన్ పండించాలన్నా కోట శ్రీనివాసరావు తర్వాతే. అంతలా ఆయన తన నటనతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఒకప్పుడు కోట లేని సినిమా అంటూ ఉండేది కాదు. ప్రతి సినిమాలో ఆయన కనిపించే వారు. ఆయన కోసమే అప్పటి దర్శకులు పాత్రలను రాసుకునే వారట.. అంతటి విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ముక్కుసూటిగా మాట్లాడే కోట.. సినిమా ఇండస్ట్రీ గురించి చాలా సందర్భాల్లో ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వయసు రీత్యా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు కోట.
తాజాగా కోట శ్రీనివాసరావు ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వెంకటేష్ తో నేను కలిసి నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మా ఇద్దరి కాంబినేషన్ ను ప్రేక్షకులు ఆదరించారు. మా కాంబోలో వచ్చిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఈసినిమాను ప్రేక్షకులు మరిచిపోలేకపోతున్నారు. ఆ క్రెడిట్ అంతా ఈవీవీ సత్యనారాయణ గారిదే.. ఇక సౌందర్య ఎంతో గొప్ప నటి, గొప్ప మనిషి, నటన .. క్రమశిక్షణ ..ఇతరులతో నడుచుకునే పద్ధతి ఏ రకంగా చూసినా ఆమె చాలా గొప్ప మనిషి. నాకు నచ్చిన హీరోయిన్ అంటే అది సౌందర్యే. కానీ చిన్న వయసులోనే దేవుడు ఆమెను మనకు కాకుండా చేశాడు. అని అన్నారు కోట.
మరిన్ని ఇక్కడ చదవండి :