AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ante Sundaraniki: నజ్రియా ఎవరి ఫోన్లు ఎత్తలేదు.. కానీ అందుకు థ్యాంక్స్.. హీరో నాని ఆసక్తికర కామెంట్స్..

న్యాచురల్ స్టార్ హీరో నాని (Nani).. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తోన్న సినిమా అంటే సుందరానికీ (Ante Sundaraniki)..

Ante Sundaraniki: నజ్రియా ఎవరి ఫోన్లు ఎత్తలేదు.. కానీ అందుకు థ్యాంక్స్.. హీరో నాని ఆసక్తికర కామెంట్స్..
Ante Sundaraniki
Rajitha Chanti
|

Updated on: Apr 20, 2022 | 6:12 PM

Share

న్యాచురల్ స్టార్ హీరో నాని (Nani).. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తోన్న సినిమా అంటే సుందరానికీ (Ante Sundaraniki).. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీలో మలయాళ బ్యూటీ నజ్రియా నజిమ్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ సినిమాతోనే నజ్రియా హీరోయిన్‍గా తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రాన్ని జూన్ 10న విడుదల చేయనున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే ఏప్రిల్ 20న అంటే సుందరానికీ టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో హీరో నాని, హీరోయిన్ నజ్రియా, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, నిర్మాత రవిశంకర్ తదితరులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. టీజర్ అదిరిపోయింది కదా.. దీనికి రెండు రెట్లు ట్రైలర్ వుంటుంది. ట్రైలర్ కి పదిరెట్లు సినిమా వుంటుంది. ప్రామిస్ అని అన్నారు..

‘అంటే సుందరానికి నాకు చాలా స్పెషల్ సినిమా. ఎందుకనేది .. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకే అర్ధమైపోతుంది. ఈ సినిమా కోసం చాలా మంచి టీమ్ పని చేసింది. చాలా రోజుల తర్వాత అంతా ఫ్యామిలీ మెంబర్స్ తో కలసి పని చేస్తున్నామనే ప్లజంట్ ఫీలింగ్ కలిగింది. ఇది మీకు తెరపై కనిపిస్తుంది. సినిమా గురించి చెప్పాల్సిన విషయాలు చాలా వున్నాయి. టీజర్ లాంచ్ కాబట్టి అప్పుడే సినిమా గురించి ఎక్కువ చెప్పను. కానీ దర్శకుడు వివేక్ ఆత్రేయ గురించి మాత్రం ఒక మాట చెప్పాలి. కొన్ని సినిమాలు, కథలు మరో దర్శకుడు తీస్తే ఎలా వుంటుంది ? అని ఊహించుకునే అవకాశం వుంటుంది. కానీ వివేక్ తీసిన సినిమా మాత్రం వివేక్ తప్పా ఎవరూ తీయలేరు. ఈ కథని వివేక్ చెప్పినట్లు ఎవరూ చెప్పలేరు. నాలో వుండే ప్రేక్షకుడు వివేక్ చేసే సినిమాలు రిలీజ్ అయితే ఫస్ట్ డే మార్నింగ్ షో చూడాలని ఫిక్స్ అయిపోయాడు. నజ్రియా తెలుగులో నటిస్తే బావుటుందని చాలా కాలంగా చాలా మంది ప్రయత్నించారు. కానీ ఎవరి ఫోన్లు ఎత్తలేదు. మా రిక్వెస్ట్ ఒప్పుకున్నందుకు, మా సినిమాలో నటించినందుకు నజ్రియాకి చాలా థ్యాంక్స్. టీజర్ అదిరిపోయింది. దీనికి రెండు రెట్లు ట్రైలర్ వుంటుంది. ట్రైలర్ కి పదిరెట్లు సినిమా వుంటుంది. ప్రామిస్’ అన్నారు నాని.

Also Read: Ashokavanamlo Arjuna Kalyanam: ముప్పై ఏళ్ళు దాటిన అర్జునుడి పెళ్లి కష్టాలు.. ఆకట్టుకుంటున్న

అశోకవనంలో అర్జున కళ్యాణం ట్రైలర్..

KGF Chapter 2: ఇదెక్కడి మాస్ మావ.. అంత పవర్‌ఫుల్ డైలాగ్‌ను ఇలా వాడేశారేంట్రా..!

Gangubai Kathiawadi: ఓటీటీలో సందడి చేయనున్న గంగూబాయి.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..