Kajal Aggarwal: బిడ్డ పుట్టాక కాజల్ భావోద్వేగ పోస్ట్.. కష్టమంతా మర్చిపోయానంటూ..

టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. ఇటీవల పండండి మగ బిడ్డకు కాజల్ జన్మినిచ్చిన సంగతి తెలిసిందే.

Kajal Aggarwal: బిడ్డ పుట్టాక కాజల్ భావోద్వేగ పోస్ట్.. కష్టమంతా మర్చిపోయానంటూ..
Kajal
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 21, 2022 | 3:23 PM

టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. ఇటీవల పండండి మగ బిడ్డకు కాజల్ జన్మినిచ్చిన సంగతి తెలిసిందే. తమ కొడుకు నీల్ కిచ్లూ అనే పేరును పెట్టినట్లు కాజల్ భర్త గౌతమ్ కిచ్లూ తన ఇన్ స్టా ఖాతా ద్వారా తెలియజేశాడు. బిడ్డ పుట్టిన తర్వాత తొలిసారి తన సంతోషాన్ని తెలియజేసింది కాజల్. బిడ్డ పుట్టిన తర్వాత తాను తొమ్మిది నెలలు పడిన కష్టాన్ని మర్చిపోయానని.. తన కొడుకును హత్తుకున్నప్పుడు ఎంతో లోతైనా భావనను పొందినట్లు భావోద్వేగ పోస్ట్ చేస్తూ.. తాను గర్భవతిగా ఉన్నప్పటి బేబి బంప్ ఫోటోను షేర్ చేసింది. తన కొడుకు నీల్‏ను ప్రపంచంలోకి ఆస్వానించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసింది.

“మా బిడ్డ నీల్‏ను ప్రపంచంలోకి ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. నీల్ పుట్టిన తర్వాత తనను తెల్లటి వస్త్రంలో చుట్టుకుని దగ్గరకు హత్తుకున్నప్పుడు కలిగిన ఫీలింగ్ ను మాటల్లో చెప్పలేను. ఆ సమయంలో నాకు కలిగిన అనుభూతి .. తల్లిగా నాకున్న బాధ్యతను గుర్తుచేసింది. నిజానికి ఒక బిడ్డకు జన్మనివ్వడం అంత సులభమైన విషయం కాదు.. మూడు నిద్రలేని రాత్రులు. .. సాగిన చర్మం.. బ్రెస్ట్ పంప్స్.. ఒత్తిడి.. ఆందోళన వంటి సమస్యలతో ఎంతో సతమతమయ్యాను. కానీ నా బిడ్డను ఎత్తుకున్నప్పుడు ఆ కష్టమంతా మర్చిపోయాను. ఇద్దరం ఒకరి కళ్లల్లోకి ఒకరం చూసుకున్నాం. ఇద్దరం కలిసి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించాం. బిడ్డ ప్రసవానంతరం ఈ విషయం అంత ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు. కానీ అందంగా మాత్రం ఉంది ” అంటూ రాసుకొచ్చింది. కాజల్ పోస్ట్ పై స్పందిస్తూ.. ఉపాసన కొణిదెల, రాశిఖన్నా, సమంత రుతు ప్రభు.. హన్సిక శుభాకాంక్షలు తెలియజేశారు.

Also Read:  RRR OTT: ఇక ఓటీటీ వంతు.. డిజిటల్‌ స్క్రీన్‌పై ట్రిపులార్‌ సందడి చేసేది ఆ రోజే.. ఎప్పుడు, ఎక్కడా.?

Neha Shetty: సోషల్ మీడియాను రఫ్ఫాడిస్తున్న డీజే టిల్లు బ్యూటీ.. నేహా ఫోజులకు ఫిదా అవుతున్న కుర్రకారు

Priyanka Chopra-Nick Jonas : ప్రియాంక చోప్రా – నిక్ జోనస్ గారాల పట్టి పేరేంటో తెలుసా?

Mahesh Babu: ఆచార్య మూవీలో సూపర్ స్టార్ సర్‌ప్రైజ్ ఎంట్రీ.. మెగా మూవీ కోసం మహేష్ ఇలా..