Tollywood : మాస్ దర్శకులంతా తమ సినిమాల్లో ఈ ఎలిమెంట్స్‌ ఎలా మిస్ అవుతున్నారబ్బా.!!

రాజమౌళి, ప్రశాంత్ నీల్‌, బోయపాటి, వినాయక్‌... మాస్ యాక్షన్ జానర్‌లో తిరుగులేని డైరెక్టర్స్‌ వీళ్ళు. ఇండస్ట్రీ రికార్డ్‌లను తిరగరాసిన ఈ డైరెక్టర్స్ విషయంలో ఫ్యాన్స్‌కు కొన్ని కంప్లయింట్స్‌ కూడా ఉన్నాయి.

Tollywood : మాస్ దర్శకులంతా తమ సినిమాల్లో ఈ ఎలిమెంట్స్‌ ఎలా మిస్ అవుతున్నారబ్బా.!!
Directors
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 22, 2022 | 9:55 AM

రాజమౌళి(Rajamouli), ప్రశాంత్ నీల్‌, బోయపాటి(Boyapati Srinu), వినాయక్‌… మాస్ యాక్షన్ జానర్‌లో తిరుగులేని డైరెక్టర్స్‌ వీళ్ళు. ఇండస్ట్రీ రికార్డ్‌లను తిరగరాసిన ఈ డైరెక్టర్స్ విషయంలో ఫ్యాన్స్‌కు కొన్ని కంప్లయింట్స్‌ కూడా ఉన్నాయి. సినిమాను సక్సెస్‌ఫుల్‌గా బ్లాక్‌ బస్టర్ రేంజ్‌కు తీసుకెళ్లే సత్తా ఉన్న ఈ డైరెక్టర్స్‌ కొన్ని ఎలిమెంట్స్‌ను మాత్రం డీల్ చేయలేకపోతున్నారు.. ఇంతకీ ఏంటా ఎలిమెంట్స్‌ అనుకుంటున్నారా.. ప్రజెంట్ సౌత్ అండ్‌ నార్త్‌ ఇండస్ట్రీల్లో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. దీంతో రొమాంటిక్ డ్రామాలను పక్కన పెట్టి మాస్ యాక్షన్ వైపు వెళుతున్నారు దర్శకులు. ఇక పాన్‌ ఇండియా రేంజ్‌కి పేటెంట్‌ తీసుకున్న రాజమౌళి, ప్రశాంత్ నీల్‌ లాంటి దర్శకులైతే కొత్త ట్రెండ్‌ను సెట్‌ చేసే పనిలో ఉన్నారు. అయితే ఈ రేంజ్‌లో బజ్ క్రియేట్ చేస్తున్న ఈ స్టార్ డైరెక్టర్స్‌.. యూత్‌ను ఎట్రాక్ట్ చేసే రొమాన్స్‌ను మాత్రం పక్కన పెట్టేస్తున్నారు. దర్శకేంద్రుడి స్కూల్‌ నుంచి వచ్చిన రాజమౌళి కూడా రొమాంటిక్‌ సీన్స్‌ను డీల్ చేయటంలో ఇబ్బంది పడుతున్నారు. ఛత్రపతి, విక్రమార్కుడు, ఈగ సినిమాల టైమ్‌లో హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ మీద కాస్త కాన్సన్‌ట్రేట్‌ చేసినా.. బాహుబలి వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చాక.. రొమాన్స్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు.

నయా పాన్ ఇండియా సెన్సేషన్‌ ప్రశాంత్ నీల్‌ కూడా రొమాంటిక్‌ సీన్స్‌ విషయంలో వెనకడుగు వేస్తున్నారు. ఈ విషయాన్ని ఈ యంగ్ డైరెక్టర్‌ ఓపెన్‌గా ఒప్పేసుకున్నారు కూడా. రొమాంటిక్ సీన్స్‌ను హీరో హీరోయిన్లకు ఎక్స్‌ప్లెయిన్ చేయటం అక్వార్డ్‌గా ఉంటుంది… అందుకే వీలైనంతవరకు నా సినిమాలో అలాంటి సీన్స్‌ను అవాయిడ్ చేస్తా అనేశారు ప్రశాంత్‌. హీరో ఎలివేషన్‌ను 70 ఎంఎం సైజ్‌లో గ్రాండ్‌గా పోట్రే చేసే ప్రశాంత్‌ నీల్‌కు రొమాన్స్‌ను డీల్ చేసే విషయంలో మాత్రం పాస్ మార్కులు కూడా కష్టమే. పాన్ ఇండియా దర్శకులు మాత్రమే కాదు రీజినల్ డైరెక్టర్ విషయంలో కూడా ఇటువంటి కంప్లయిట్సే ఉన్నాయి. బోయపాటి, వినాయక్ లాంటి సాలిడ్ మాస్‌ యాక్షన్ దర్శకులు రొమాంటిక్ సీన్స్ విషయంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. యాక్షన్ సీన్స్‌ను హై లెవల్‌లో ప్రజెంట్ చేస్తున్న ఈ డైరెక్టర్స్ హీరో- హీరోయిన్ల కెమిస్ట్రీని సెన్సిబుల్‌గా ప్రజెంట్ చేయలేకపోతున్నారు అనే కంప్లయింట్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో సుకుమార్ కాస్త యూనిక్ అని చెప్పొచ్చు. ఈ లెక్కల మేస్టారు మాస్ యాక్షన్‌ను ఏ రేంజ్‌లో చూపిస్తున్నారో.. రొమాంటిక్‌ సీన్స్‌ను కూడా అదే రేంజ్‌లో ప్రజెంట్ చేస్తున్నారు. రీసెంట్‌గా పుష్ప సినిమాలో బన్నీ యాక్షన్‌కు ఏ రేంజ్‌ అప్లాజ్ వచ్చిందో.. శ్రీవల్లి, పుష్పరాజ్‌ల లవ్‌ యాంగిల్‌ కూడా అదే రేంజ్‌లో క్లిక్ అయ్యింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

KGF 2: జక్కన్న ఆర్ఆర్ఆర్ టార్గెట్‏ను చేసిన కేజీఎఫ్.. ఎట్టకేలకు రికార్డ్ క్రాస్ చేసిందిగా..

KGF Chapter 2: కేజీఎఫ్ రియల్ రాఖీభాయ్ ఎవరో తెలుసా ?.. కోలార్ మైన్స్ హీరో ఇతడే..