Mike Tyson: అభిమాని అత్యుత్సాహం.. చితక్కొట్టిన మైక్ టైసన్.. వీడియో వైరల్

కొన్ని సార్లు ఫ్యాన్స్ చేసే అత్యుత్సాహం సెలబ్రెటీలను చిర్రెత్తుకొచ్చేలా చేస్తుంది. దాంతో కొంతమంది సహనం కోల్పోయి వారిపై కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు.

Mike Tyson: అభిమాని అత్యుత్సాహం.. చితక్కొట్టిన మైక్ టైసన్.. వీడియో వైరల్
Mike Tyson
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 22, 2022 | 12:52 PM

కొన్ని సార్లు ఫ్యాన్స్ చేసే అత్యుత్సాహం సెలబ్రెటీలను చిర్రెత్తుకొచ్చేలా చేస్తుంది. దాంతో కొంతమంది సహనం కోల్పోయి వారిపై కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సెలబ్రెటీలు అభిమానులపై చేయి చేసుకున్న సంఘటనలు చాలా చూశాం.. తాజాగా బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్(Mike Tyson) కూడా తన సహనాన్ని కోల్పోయాడు. ఉక్రోషాన్ని ఆపుకోలేక ఓ అభిమానిని చితక్కొట్టాడు.. అది కూడా ఓ విమానంలో.. ఇంతకు ఏం జరిగిందంటే.. మైక్ టైసన్ ఓ అభిమానికి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వెళ్తున్న విమానంలో కనిపించాడు. దాంతో అతడు మైక్ టైసన్ తో మాట్లాడాలని ప్రయత్నించాడు. అందుకు మైక్ అంగీకరించలేదు. అయినాసరే ఆ అభిమాని వినిపించుకోలేదు. పదే పదే అతడి దగ్గరకు వెళ్లి విసిగించడం మొదలుపెట్టాడు.

మైక్ టైసన్ ఎంత కూల్ గా ఉన్నా అతడిని సదరు వ్యక్తి రెచ్చగొట్టాడు. వెనక సీట్ లో కూర్చొని మైక్ ను విసిగించాడు. దాంతో సహనం కోల్పోయాడు మైక్ టైసన్. వెంటనే అతడి పై పిడి గుద్దుల వర్షం కురిపించాడు. ఆ వ్యక్తి ముఖంపై టైసన్ అనేక పంచ్‌లు వేయడంతో అతడి తల పై చిన్నపాటి గాయం అయ్యింది. ఇదంతా అక్కడే ఉన్న మరో ప్యాసింజర్ వీడియో తీశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మైక్ టైసన్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

( మరిన్ని వైరల్ ఆర్టికల్స్ కోసం టీవీ9 వెబ్ సైట్‌లో ట్రెండింగ్ ను క్లిక్ చేయండి )

మరిన్ని ఇక్కడ చదవండి :

Johnny Depp: మాజీ భార్యపై రూ. 380 కోట్ల పరువునష్టం దావా వేసిన స్టార్ హీరో..

Tollywood : మాస్ దర్శకులంతా తమ సినిమాల్లో ఈ ఎలిమెంట్స్‌ ఎలా మిస్ అవుతున్నారబ్బా.!!

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ మీద గుస్సాగా ఉన్న మెగా ఫ్యాన్స్.. కారణం ఇదే..