AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jersey Movie: జెర్సీ సినిమాపై ప్రశంసలు కురిపించిన న్యాచురల్ స్టార్.. మీ మంచి మనసే కారణమంటూ స్టార్ హీరో రిప్లై..

న్యాచురల్ స్టార్ నాని (Nani) ప్రధాన పాత్రలో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిన విషయమే.

Jersey Movie: జెర్సీ సినిమాపై ప్రశంసలు కురిపించిన న్యాచురల్ స్టార్.. మీ మంచి మనసే కారణమంటూ స్టార్ హీరో రిప్లై..
Nani
Rajitha Chanti
|

Updated on: Apr 22, 2022 | 3:35 PM

Share

న్యాచురల్ స్టార్ నాని (Nani) ప్రధాన పాత్రలో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిన విషయమే. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మించగా.. ఇందులో నాని జోడిగా శ్రద్ధ శ్రీనాధ్ కథనాయికగా నటించింది. తెలుగు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ మూవీని హిందీలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని జెర్సీ టైటిల్‏తోనే డైరెక్టర్ తిన్ననూరి గౌతమ్ హిందీలోనూ తెరకెక్కించారు. ఈ సినిమా ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి ప్రేక్షకులు, సినీ విశ్లేషకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో షాహిద్ కపూర్ నటనకు అద్భుతమంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా పై న్యాచురల్ స్టార్ నాని ప్రశంసలు కురిపించాడు.

“జెర్సీ హిందీ వెర్షన్ చూశాను.. మా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి మరోసారి తమ ప్రతిభను చూపించారు. సినిమా చాలా చాలా బాగా వచ్చింది. షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ సహా ఇతరులు సైతం బాగా నటించారు. ఓ మంచి సినిమాను తీశారు. కంగ్రాచులేషన్స్ ” అంటూ నాని ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించాడు. ఇక నాని ట్వీట్‏కు రిప్లై ఇచ్చాడు బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ స్పందించాడు. ” ఒక అర్జున్ ఇంకో అర్జున్‏కి చెప్పిన ఈ అభినందనలకు స్పెషల్ థ్యాంక్స్. ఈ జెర్సీ ఇంత బాగా రావడానికి మీ మంచి మనసే కారణం. మీకు భవిష్యత్తులో మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ రావాలని కోరుకుంటున్నాను ” అంటూ రీట్వీట్ చేశాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Mike Tyson: అభిమాని అత్యుత్సాహం.. చితక్కొట్టిన మైక్ టైసన్.. వీడియో వైరల్

F3 Movie: ‘ఎఫ్ 3’ నుంచి మరోసాంగ్.. కుర్రకారును కిర్రెక్కిస్తున్న ‘ఊ..ఆ..ఆహా..ఆహా’ పాట

Acharya: మెగాస్టార్ సినిమాకు సూపర్ స్టార్ మాట సాయం.. క్లారిటీ ఇచ్చిన కొరటాల

Johnny Depp: మాజీ భార్యపై రూ. 380 కోట్ల పరువునష్టం దావా వేసిన స్టార్ హీరో..