AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neha Shetty: మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన ‘డీజే టిల్లు’ రాధిక.. కార్తికేయ సరసన నేహా శెట్టి..

మెహబుబా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ నేహా శెట్టి (Neha Shetty).. గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో నటించింది.

Neha Shetty: మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన 'డీజే టిల్లు' రాధిక.. కార్తికేయ సరసన నేహా శెట్టి..
Neha Shetty Karthikeya
Rajitha Chanti
|

Updated on: Apr 22, 2022 | 3:05 PM

Share

మెహబుబా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ నేహా శెట్టి (Neha Shetty).. గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో నటించింది. ఇటీవల యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ సరసన డీజే టిల్లు సినిమాలో నటించింది. ఈ మూవీలో రాధిక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. డీజే టిల్లు సినిమాతో నేహాక ఒక్కసారిగా క్రేజ్ మారిపోయింది. అందం, అభినయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నేహ. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస అవకాశాలను అందుకుంటూ ఫుల్ జోరుమీదుంది. తాజాగా నేహా శెట్టి మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. యంగ్ హీరో కార్తికేయ తదుపరి చిత్రంలో కథానాయికగా ఎంపికైంది నేహా శెట్టి.. సైమా, ఆహా పురస్కార వేడుకల్లో బెస్ట్ డెబ్యూడెంట్ ప్రొడక్షన్ హౌస్ అవార్డులు అందుకున్న లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ‘కలర్ ఫొటో’, ‘తెల్లవారితే గురువారం’ తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. సి. యువరాజ్ చిత్ర సమర్పకులు. క్లాక్స్ దర్శకుడు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేయడంతో పాటు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు.

హీరో హీరోయిన్ల మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కార్తికేయ సతీమణి లోహిత కెమెరా స్విచ్ఛాన్ చేయగా, నిర్మాత సూర్యదేవర నాగవంశీ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు ‘ఉప్పెన’ ఫేమ్ సానా బుచ్చిబాబు స్క్రిప్ట్ అందించారు. నిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ “కార్తికేయకు ఇదొక డిఫరెంట్ సినిమా. కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిస్తున్నాం. ఈ రోజు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాం. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, యానాం పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా చిత్రీకరణ చేస్తాం. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. స్వర్గీయ సిరివెన్నెల గారు మా చిత్రంలో ఒక పాట రాశారు. ఆయన రాసిన ఆఖరి పాట ఇదే. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం” అన్నారు.

దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ “డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. ప్రతి ఒక్కరికీ కొత్తగా, విభిన్నంగా బతకాలని ఉంటుంది. కానీ, పరిస్థితుల ప్రభావంతో సాధారణంగా జీవిస్తారు. ఎవరు ఏమనుకున్నా, ఎన్ని అనుకున్నా తనకు నచ్చినట్టు జీవిస్తూ… తనదైన దారిలో వెళ్లే ఓ యువకుడి కథ ఇది” అని చెప్పారు. ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ‘ఆటో’ రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని కీలకపాత్రలలో నటిస్తున్నారు.

Also Read: Mike Tyson: అభిమాని అత్యుత్సాహం.. చితక్కొట్టిన మైక్ టైసన్.. వీడియో వైరల్

F3 Movie: ‘ఎఫ్ 3’ నుంచి మరోసాంగ్.. కుర్రకారును కిర్రెక్కిస్తున్న ‘ఊ..ఆ..ఆహా..ఆహా’ పాట

Acharya: మెగాస్టార్ సినిమాకు సూపర్ స్టార్ మాట సాయం.. క్లారిటీ ఇచ్చిన కొరటాల

Johnny Depp: మాజీ భార్యపై రూ. 380 కోట్ల పరువునష్టం దావా వేసిన స్టార్ హీరో..