Health Tips: పెరుగు తింటే బాడీలో యూరిక్‌ యాసిడ్‌ పెరుగుతుందా..!

Health Tips: ఎండాకాలంలో ప్రతి ఒక్కరు పెరుగు తింటారు. ఎందుకంటే పెరుగు వేడినుంచి ఉపశమనం కలిగిస్తుంది. కానీ ఇప్పటికి పెరుగుతినడంపై చాలా అపోహలు ఉన్నాయి.

Health Tips: పెరుగు తింటే బాడీలో యూరిక్‌ యాసిడ్‌ పెరుగుతుందా..!
Curd
Follow us
uppula Raju

| Edited By: Phani CH

Updated on: Apr 21, 2022 | 8:08 AM

Health Tips: ఎండాకాలంలో ప్రతి ఒక్కరు పెరుగు తింటారు. ఎందుకంటే పెరుగు వేడినుంచి ఉపశమనం కలిగిస్తుంది. కానీ ఇప్పటికి పెరుగుతినడంపై చాలా అపోహలు ఉన్నాయి. యూరిక్ యాసిడ్‌తో బాధపడుతున్న వ్యక్తులు పెరుగుతినకూడదని చెబుతారు. ఎందుకంటే పెరుగులో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయని అందుకే తినకూడదని అంటారు. వాస్తవానికి పెరుగులో ప్రొటీన్లు ఎక్కువగానే ఉంటాయి. కానీ ఇది యూరిక్‌ యాసిడ్‌ పేషెంట్లకి నష్టం కలిగిస్తుందని ఎక్కడా నిరూపణ కాలేదు. పెరుగుతింటే యూరిక్ యాసిడ్‌ పెరుగుతుందని ఒక అపోహ మాత్రమే.

అంతేకాదు పెరుగు తినడం వల్ల యూరిక్ యాసిడ్ పెరగదని చాలా నివేదికలలో తేల్చారు. అయినా కొంతమంది ఈ విషయాన్ని నమ్మరు. వేసవిలో పెరుగు తీసుకుంటే జీర్ణవ్యవస్థ బలంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని రిఫ్రెష్ చేయడానికి సహాయపడుతుంది. యూరిక్ యాసిడ్ వల్ల రోగులు చాలా నొప్పులని అనుభవిస్తారు. నిజానికి ఈ నొప్పులను ఎదుర్కొనడంలో పెరుగు ప్రయోజనకరంగా పనిచేస్తుంది. పెరుగు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దంతాలు, ఎముకలు దృఢంగా ఉండాలంటే పెరుగు తప్పకుండా తినాలి. అంతే కాకుండా పెరుగు గుండెను సురక్షితంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

పెరుగు రెగ్యులర్‌ గా తినడం వల్ల అధిక బరువు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. పెరుగులో కొవ్వు తక్కువగా ఉండి ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కనుక కొద్దిగా పెరుగు అన్నం తినడం వల్ల కావాల్సిన శక్తి లభిస్తుంది. తద్వార శరీరంలో అదనపు కొవ్వు పేరుకు పోవడం జరగదు. రెగ్యులర్‌ గా పెరుగు ను ఆహారంలోకి తీసుకోవడం వల్ల మెల్ల మెల్లగా కొవ్వు కరిగి పోయి బరువు తగ్గుతారు. పాలు తాగడం కుదరని వారు దానికి ప్రత్యామ్నాయంగా పెరుగు తాగవచ్చు. పాలలో ఉండే కాల్షియం పెరుగులో కూడా ఉంటుంది. కనుక ఎవరికైతే కాల్షియ లోపం ఉండి ఎముకలు పటిష్టంగా ఉండవో వారు పెరుగు ను తమ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

DC vs PBKS: పంజాబ్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ సూపర్ విక్టరీ.. హాఫ్ సెంచరీతో రాణించిన డేవిడ్‌ వార్నర్..

Health Tips: కొలస్ట్రాల్‌ తగ్గాలంటే ఈ ఆహార చిట్కాలు పాటించండి..!

Small Savings Schemes: చిన్న పొదుపు పథకాలని ఉపయోగించుకోండి.. మంచి లాభాలని ఆర్జించండి..!