Health Tips: కొలస్ట్రాల్‌ తగ్గాలంటే ఈ ఆహార చిట్కాలు పాటించండి..!

Health Tips: ఆధునిక కాలంలో చాలామంది కొలస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణం అనేకం ఉన్నాయి. సమయపాలన లేని ఆహారపు

Health Tips: కొలస్ట్రాల్‌ తగ్గాలంటే ఈ ఆహార చిట్కాలు పాటించండి..!
Cholesterol
Follow us
uppula Raju

|

Updated on: Apr 20, 2022 | 9:33 PM

Health Tips: ఆధునిక కాలంలో చాలామంది కొలస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణం అనేకం ఉన్నాయి. సమయపాలన లేని ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది స్థూలకాయం బారిన పడుతున్నారు. దీంతో గుండెజబ్బుల బారిన పడుతున్నారు. వాస్తవానికి మనిషి శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒకటి చెడుదైతే రెండవది మంచిది. చెడు కొలెస్ట్రాల్ అనేది గుండె జబ్బులకు దారి తీస్తోంది. అందుకే కొలస్ట్రాల్ తగ్గించే ఆహారాల గురించి తెలుసుకుందాం. మనిషి శరీరానికి గుడ్ కొలెస్ట్రాల్( HDL)ఎంత మంచిదో..బ్యాడ్ కొలెస్ట్రాల్(LDL)అంత ప్రమాదకరం. బ్యాడ్ కొలస్ట్రాల్‌ వల్ల గుండె జబ్బులతో పాటు ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కూరగాయలు అధికంగా తీసుకుంటే అందులో ఉండే ఫైబర్ శరీరానికి చాలా శక్తిని ఇస్తుంది. శరీరంలోని చెడు కొవ్వును కరిగిస్తుంది. వంకాయ, బెండకాయలో అధికంగా ఉండే ఫైబర్..కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. బ్రకోలి, చిలకడదుంప కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

రెండోది నట్స్, తృణ ధాన్యాలు. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల ఎల్‌డీఎల్‌ను తగ్గించవచ్చు. నట్స్‌లో ఉండే ప్రోటీన్ రక్తంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. తృణధాన్యాల్లో ఉండే ఫైబర్ కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఓట్స్‌లో అధికంగా ఉండే ఫైబర్ బీటా గ్లూకాన్ రూపంలో ఉంటుంది. ఆకలిని తగ్గించడమే కాకుండా ఇది కొవ్వును కరిగిస్తుంది. ప్రతిరోజు గ్రీన్ టీ తాగాలి. ఇది LDL కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. కొబ్బరి నూనె LDL, HDL నిష్పత్తిని సమతుల్యం చేస్తుంది. వెల్లుల్లిని ప్రతిరోజు తీసుకుంటే కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అవిసె గింజలు, చేప నూనె చెడు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర, ధూమపానం, మద్యానికి దూరంగా ఉంటే మంచిది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Small Savings Schemes: చిన్న పొదుపు పథకాలని ఉపయోగించుకోండి.. మంచి లాభాలని ఆర్జించండి..!

Health Tips: మళ్లీ పెరుగుతున్న కొవిడ్‌ కేసులు.. ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని పాటించాల్సిందే..!

Credit Cards vs Personal Loan: క్రెడిట్‌ కార్డు వర్సెస్ పర్సనల్‌ లోన్.. ఈ రెండింటిలో ఏది బెటర్..!

చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
ఆ స్టార్ హీరో సినిమాలో శివ కార్తికేయన్ స్పెషల్ రోల్‌!
ఆ స్టార్ హీరో సినిమాలో శివ కార్తికేయన్ స్పెషల్ రోల్‌!
మెగా వేలం ఆక్షనీర్ మల్లికా సాగర్ బయోడేటా..
మెగా వేలం ఆక్షనీర్ మల్లికా సాగర్ బయోడేటా..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!