Coconut Water Benefits: ప్రతిరోజూ ఒక్క గ్లాస్ కొబ్బరి నీళ్లు తాగితే బోలెడు లాభాలు.. హైబీపీతో పాటు అనేక సమస్యలకు చెక్..
Coconut Water Benefits: ఎండలు దంచి కొడుతున్నాయి. నడినెత్తిలో సూర్యా రావు స్ట్రాతో ఎనర్జీని లాగేస్తున్నాడు. రోజు రోజుకు పెరుగుతున్న వేడి తీవ్రతతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గత వారం రోజులుగా 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఎండలు దంచి కొడుతున్నాయి. నడినెత్తిలో సూర్యా రావు స్ట్రాతో ఎనర్జీని లాగేస్తున్నాడు. రోజు రోజుకు పెరుగుతున్న వేడి తీవ్రతతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గత వారం రోజులుగా 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా మంది డీహైడ్రేషన్ బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిత్యం కొన్ని చిట్కాలను పాటించినట్లైతే ఎండ వేడి నుంచి మనను మనం రక్షించుకోవచ్చు. ఇందు కోసం కనీసం రోజులో ఒక్క గ్లాస్ కొబ్బరి నీటిని తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కొబ్బరి బొండం తాగడం తాగడం వల్ల వడదెబ్బ నుంచి బయటపడొచ్చు. ప్రతిరోజూ కొబ్బరినీరు తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీని వల్ల అధిక బరువు తగ్గడంతో పాటు శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండార జాగ్రత్త వహించవచ్చు. అయితే కొబ్బరినీరు(coconut water) వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక రక్తపోటు నియంత్రణ కోసం..
రక్తపోటు(BP) అదుపులో ఉండేందుకు రోజూ కనీసం ఒక్క గ్లాస్ కొబ్బరినీళ్లు తాగడం మంచిది. అధిక రక్తపోటును నియంత్రించడంలో కొబ్బరి నీరు కీలకపాత్ర పోషిస్తుంది. ఈ రక్తపోటు సాధారణ స్థాయిని తీసుకొచ్చేందుకు కొబ్బరి నీరు సహకరిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది..
కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొబ్బరికాయలో దాదాపు 600 మి.గ్రా పొటాషియం ఉంటుంది. ఈ క్రమంలో ప్రతిరోజూ కొబ్బరి నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ మరియు పొటాషియం వంటి పోషకాలు తెల్ల రక్త కణాలను పెంచుతాయి. దీని కారణంగా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు, దంతాలు కూడా దృఢంగా తయారవుతాయి.
జీర్ణ వ్యవస్థ
కడుపు నొప్పి లేదా పొట్ట సంబంధిత సమస్యలు వేసవిలో ఎక్కువ ఇబ్బంది పెడతాయి. నూనెలో వేయించిన ఆహారం తీసుకోవడం వల్ల అజీర్ణం, అసిడిటీ, ఇతర సమస్యలు ఇబ్బందిగా మార్చేస్తాయి. ఇలాంటి ఆహారాన్ని వేసవి కాలంలో తీసుకోవడం మానుకోండి. రోజుకు ఒకసారి చల్ల-చల్లని కొబ్బరి నీరు తాగడం. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడం ద్వారా మీ ఆకలిని పెంచుతుంది. కొబ్బరి నీరు తాగడం వల్ల మలబద్ధక సమస్య తగ్గుతుంది.
వాంతుల నుంచి ఉపశమనం
వాంతులు, విరేచనాల సమస్యతో బాధపడే వారు కొబ్బరి నీరు తాగడం వల్ల వెంటనే ఉపశమనం లభిస్తుంది. అలాంటి అనారోగ్య సమస్యలతో తరచూ బాధపడే వారు ఈ జాగ్రత్తలు పడితే మంచిది. వాంతులు, విరేచనాలతో పాటు కడుపులో, పేగుల్లో మంట.. అల్సర్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఇవి కూడా చదవండి: CM Jagan: సీనియర్లే ఇలా చేస్తే ఎలా.. మంత్రి కాకాని, అనిల్‌కు సీఎం జగన్ క్లాస్..