CM Jagan: సీనియర్లే ఇలా చేస్తే ఎలా.. మంత్రి కాకాని, అనిల్‌కు సీఎం జగన్‌ క్లాస్‌..

సింహపురి పొలిటికల్‌ పంచాయతీ సీఎం జగన్‌ తేల్చేశారు. గంట సమయం పాటు ఇద్దరికీ క్లాస్ తీసుకున్నారు. సీనియర్లే ఇలా చేస్తే ఎలా ప్రశ్నించిన సీఎం జగన్‌ ప్రశ్నించారు. పార్టీ కోసం కలిసికట్టుగా పని చేయాలని..  ఏదైనా ఉంటే..

CM Jagan: సీనియర్లే ఇలా చేస్తే ఎలా.. మంత్రి కాకాని, అనిల్‌కు సీఎం జగన్‌ క్లాస్‌..
Cm Jagan Had An Hour Long M
Follow us

|

Updated on: Apr 20, 2022 | 7:06 PM

సింహపురి పొలిటికల్‌ పంచాయతీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(CM YS Jagan) తేల్చేశారు. గంట సమయం పాటు ఇద్దరికీ క్లాస్ తీసుకున్నారు. సీనియర్లే ఇలా చేస్తే ఎలా ప్రశ్నించిన సీఎం జగన్‌ ప్రశ్నించారు. పార్టీ కోసం కలిసికట్టుగా పని చేయాలని..  ఏదైనా ఉంటే తనతోనే సంప్రదించాలని సూచించారు. నెల్లూరు జిల్లా వైసీపీ పంచాయితీ చేరింది. ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం తాజా, మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి(Minister Kakani Govardhan Reddy), అనిల్ కుమార్ యాదవ్‌లను(Anil Kumar Yadav) సీఎం జగన్‌తో భేటీకి ఆహ్వానించింది. దీంతో బుధవారం మధ్యాహ్నం సీఎం జగన్మోహన్ రెడ్డితో అనిల్ కుమార్ యాదవ్ భేటీ అయ్యారు. మాజీ మంత్రి అనిల్‌తో భేటీ అనంతరం సీఎం క్యాంప్ కార్యాలయానికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చేరుకుని.. జగన్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మొత్తానికి సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే నెల్లూరు వైసీపీ నేతల పంచాయితీకి ఎండ్ కార్డ్ పడింది.

అయితే.. సమావేశం అనంతరం మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి మాట్లాడుతూ.. అనిల్‌కు తనకు మధ్య ఎక్కడా విభేదాలు లేవని తేల్చి చెప్పారు. తాము ఎక్కడా పోటా పోటీ సభలు నిర్వహించలేదన్నారు. పోటా పోటీ సభలు అనేవి మీడియా సృష్టి అంటూ కొట్టిపారేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితితుల్లో నిప్పు లేకుండానే పొగ వస్తుందన్నారు. నెల్లూరులో అంతా ఫ్రెండ్లీ వాతావరణం ఉందని చెప్పుకొచ్చారు. నీడనిచ్చే చెట్టునే నరుక్కునే మూర్ఖులం తాము కాదన్నారు. సీఎం జగన్ తిరిగి సీఎం కావడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. తనకు అనిల్‌కు మధ్య ఎలాంటి గ్యాప్ లేదన్నారు. నెల్లూరులో ఎవరి ఫ్లక్సీలను ఎవరూ చింపలేదన్నారు. ఇరువురూ సమన్వయంతో కలిసి పనిచేయాలని సీఎం జగన్ ఆదేశించారని.. పార్టీ అభివృద్ది సంక్షేమం గురించే సీఎంతో మాట్లాడినట్లుగా వెల్లడించారు. ఇతర అంశాలు చర్చకు రాలేదన్నారు.

కాగా, మంత్రి కాకాణి, ఆనం, వేంరెడ్డి వర్గాలకు వ్యతిరేకంగా అనిల్ యాదవ్ పనిచేస్తున్నారంటూ ఆయా వర్గాలు అధిష్టానానికి ఫిర్యాదు చేశాయి. అలాగే, తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ అనిల్ సైతం కంప్లైంట్ ఇచ్చారు. దీంతో మాజీ మంత్రి అనిల్‌ యాదవ్‌కు, కాకాణికి ముఖ్యమంత్రి నుంచి పిలుపు వచ్చింది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్‌ను అనిల్‌ కుమార్‌ యాదవ్ ఈ సమావేశం జరిగింది.

పరస్పరం ఆరోపణలు చేసుకున్న అనిల్‌, కాకాణిలపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా వైసీపీలో విభేదాలకు శుభం కార్డు పడుతుందో లేదో అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి: Minister Kishan Reddy: రైతుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం ఆడుకుంటోంది.. వరి కొనుగోళ్లలో విఫలమైందన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

 Minister Kishan Reddy: రైతుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం ఆడుకుంటోంది.. వరి కొనుగోళ్లలో విఫలమైందన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Bandi Sanjay: సాయి గణేష్ మరణంపై సీబీఐ విచారణ జరిపించాలి.. బీజేపీ చీఫ్ బండి సంజయ్ డిమాండ్

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ