Minister Kishan Reddy: రైతుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం ఆడుకుంటోంది.. వరి కొనుగోళ్లలో విఫలమైందన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
Paddy Procurement: రైతుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యలపై రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు.
రైతుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Minister Kishan Reddy) విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యలపై రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. యాసంగిలో అధికంగా వచ్చే నూకలను తగ్గించాలంటే కొద్ది రోజుల ముందుగా రైతులతో పంట వేయించి ఉంటే బాగుడేదని అన్నారు. ఇలా చేయకుండా కాలయాపన చేసిందని విమర్శించారు. బాయిల్డ్ రైస్‌పై కేసీఆర్ ప్రభుత్వం తొండాట ఆడుతోందన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని ఆనాడు ఒప్పుకుని, ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. బాయిల్డ్ రైస్ తీసుకోమని కేంద్రం చెప్పింది.. అందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంది. ఇది నిజం కాదా అంటూ ప్రశ్నించారు కిషన్‌రెడ్డి.
ఇప్పటి వరకు ఆరు సార్లు పొడిగిస్తూ వస్తున్నాం.. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అందించలేకపోయింది. ఎఫ్‌సీఐకి యాసంగి బియ్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందన్నారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. రైతుల పక్షంలోనే తమ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. కనీసం గొనె సంచుల కొరత ఉంది.. తూకం వేసేందుకు కాంటాలు లేవు. ధాన్యం అంచనాకు తగ్గట్టుగా గన్నీ బ్యాగులను సిద్ధం చేయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం. ఎలక్ర్టానిక్ తూకం యంత్రాలు, ధాన్యం శుద్ధి యం త్రాలు, తేమశాతం కొలిచే యంత్రాలు సరిపడేన్ని అందుబాటులో లేవన్నారు. వర్షాలు వస్తే రక్షించుకునేందుకు మార్కెట్ యార్డుల్లో టార్పాలిన్ కవర్లును రాష్ట్ర ప్రభుత్వం అందించలేక పోయిందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
ఇవి కూడా చదవండి: Bandi Sanjay: సాయి గణేష్ మరణంపై సీబీఐ విచారణ జరిపించాలి.. బీజేపీ చీఫ్ బండి సంజయ్ డిమాండ్