Hyderabad: కూల్‌డ్రింక్‌ లారీ బోల్తా.. కట్ చేస్తే పోలీసులు వచ్చేసరికి షాకింగ్ సీన్.. వైరల్ వీడియో

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Apr 20, 2022 | 1:14 PM

ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే..చుట్టకి నిప్పు కావాలన్నాడట ఇంకొకడు. అట్లనే ఉంది ఇక్కడ వ్యవహారం. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా..

Hyderabad: కూల్‌డ్రింక్‌ లారీ బోల్తా.. కట్ చేస్తే పోలీసులు వచ్చేసరికి షాకింగ్ సీన్.. వైరల్ వీడియో
Cold Drinks Lorry

ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే..చుట్టకి నిప్పు కావాలన్నాడట ఇంకొకడు. అట్లనే ఉంది ఇక్కడ వ్యవహారం. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేసే రకం జనాలు. అటువంటిది ఓ కూల్‌ డ్రింక్‌ బాటిళ్ల లారీ బోల్తా పడితే ఎగబడకుండా ఉంటారా? అంటే ఆహా..అస్సలు క్షణం కూడా ఆగరు. మూలనున్నా ముసలాడు కూడా రిగెత్తుకుంటూ వెళ్లిపోతాడు. అచ్చం అదే జరిగిందీడ.

అసలే ఎండాకాలం.. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరని పరిస్తితి. పైగా కూల్‌డ్రింక్‌లకు ఎక్కువ డిమాండ్‌ ఉన్న కాలం కూడా ఇదే. ఈ పరిస్థితుల్లో కూల్‌డ్రింక్‌ బాటిళ్ల లోడుతో వేళుతున్న ఓలారీ బోల్తా పడింది. అది తెలిసిన జనాలు ఎగబడ్డారు. ఇదే సరైన సమయం అనుకొని దొరికినకాడికి బాటిళ్లను బుజానెత్తుకుని వెళ్లిపోయారు.

హైదరాబాద్‌ పెద్దఅంబర్ పేట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు మీద జరిగిందీ సంఘటన. లారీ బోల్తా పడి, భారీ ఎత్తున్న తమ్సప్ బాటిల్స్ రోడ్ పై పడిపోవడంతో ట్రేలకు ట్రేలు లూటీ చేశారు వాహనదారులు. ఇగ ఆనోటా ఈనోటా పడి చుట్టుపక్కల ఉన్నవారికి తెలువడంతో పోలీసులు వచ్చేలోగా లూఠీ ఓ రేంజ్‌లో సాగింది. కాగా, పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అటు లారీలో ప్రయాణిస్తున్న డ్రైవర్ సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu