ఐపీఎల్‌లో అరంగేట్రం.. 4 బంతుల్లో మ్యాచ్‌నే మలుపు తిప్పాడు.. ఈ 75 లక్షల ప్లేయర్ ఎవరో తెలుసా?
ముంబై వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌తో..
ముంబై వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌తో రాయల్స్ సీజన్‌లో నాలుగో విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ విజయంలో జోస్ బట్లర్, యుజ్వేంద్ర చాహల్ కీలక పాత్రలు పోషించగా.. మ్యాచ్ మాత్రం లాస్ట్ ఓవర్‌లో మలుపు తిరిగింది. ప్రత్యర్ధి జట్టు విజయానికి 11 పరుగులు కావాల్సి ఉండగా.. అప్పుడే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఓ యువ బౌలర్.. కేవలం 4 బంతుల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. రూ. 75 లక్షలకు అమ్ముడుపోయిన ఆ బౌలర్ ఎవరో తెలుసా.? వివరాలు ఇలా ఉన్నాయి.
2018లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఒబెడ్ మెక్‌కాయ్.. ఆ ఏడాది కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో సెయింట్ లూసియా తరపున సీజన్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. 2019లో వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటిదాకా వెస్టిండీస్ తరపున 2 వన్డేలు ఆడిన మెక్‌కాయ్ దాదాపు 7.50 సగటుతో 4 వికెట్లు తీశాడు. అలాగే 13 టీ20 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టాడు.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్.. మెక్‌కాయ్‌ను రూ. 75 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన మెక్‌కాయ్.. 3.4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. మరీ ముఖ్యంగా చివరి ఓవర్‌లో 11 పరుగులను కాపాడాల్సి ఉండగా.. మూడు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.. 4 మ్యాచ్‌ల్లో మొత్తం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసి.. తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.
ఇవి కూడా చదవండి: