అబ్బాయిల జెర్సీలనే మార్చి అమ్మాయిలకు.. సమోసాలు తినిపించి మరీ ప్రపంచకప్ ఆడించారు: బీసీసీఐ మాజీ ఛీప్ సంచలన కామెంట్స్

బీసీసీఐపై మునుపెన్నడూ రాని ఆరోపణలివి. గతంలో ఎవ్వరూ చేయని కామెంట్స్‌ ఇవి. దేశంలో అతిపెద్ద క్రీడా బోర్డులో ఇంత దారుణమైన వివక్ష ఉంటుందని ఎవరూ అనుకోలేదు. కాని బోర్డులో మూడేళ్లపాటు స్పెషల్‌ అడ్మినిస్ట్రేటర్‌ వినోద్‌రాయ్‌ చేసిన కామెంట్స్‌ సంచలనంగా..

అబ్బాయిల జెర్సీలనే మార్చి అమ్మాయిలకు.. సమోసాలు తినిపించి మరీ ప్రపంచకప్ ఆడించారు: బీసీసీఐ మాజీ ఛీప్ సంచలన కామెంట్స్
Bcci Team India Womens
Follow us
Venkata Chari

|

Updated on: Apr 19, 2022 | 7:03 PM

బీసీసీఐ(BCCI)పై మునుపెన్నడూ రాని ఆరోపణలివి. గతంలో ఎవ్వరూ చేయని కామెంట్స్‌ ఇవి. దేశంలో అతిపెద్ద క్రీడా బోర్డులో ఇంత దారుణమైన వివక్ష ఉంటుందని ఎవరూ అనుకోలేదు. కాని బోర్డులో మూడేళ్లపాటు స్పెషల్‌ అడ్మినిస్ట్రేటర్‌ వినోద్‌రాయ్‌(Bcci chief vinod rai) చేసిన కామెంట్స్‌ సంచలనంగా మారాయి. వినోద్‌ రాయ్‌ని సూప్రీంకోర్టు.. 2017-19 మధ్య బీసీసీఐ స్పెషల్‌ కమిటి అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. బీసీసీఐలో ఎన్నికలు జరిగే వరకు వినోద్‌ రాయ్‌ సహా రామచంద్ర గుహ, విక్రమ్‌ లిమాయే, భారత మాజీ కెప్టెన్‌ డయానా ఎడుల్జీలతో నలుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసి బోర్డు అడ్మినిస్ట్రేషన్‌ నడిపించారు. ఈ 3 ఏళ్ల కాలంలో వినోద్‌ రాయ్‌ బీసీసీఐలో జరిగిన లోటుపాట్ల గురించి, దారుణలపై అధ్యయనం చేసి.. బుక్‌ రూపంలో బయటకు రిలీజ్‌ చేశారు. ఆయన రాసిన ”నాట్‌ జస్ట్‌ ఏ నైట్‌ వాచ్‌మన్‌” అనే బుక్‌ తో ఈ సంచలన విషయాలు బయటికొచ్చాయి. బీసీసీఐకి వినోద్‌రాయ్‌ అ‍డ్మినిస్ట్రేటర్‌గా పనిచేసిన కాలంలో జరిగిన అనుభవాలను, జ్ఞాపకాలను పొందుపరిచారు. అందులోనే అంతర్లీనంగా మహిళా క్రికెటర్లు(Team India Womens) ఎదుర్కొన్న వివక్ష గురించి కూడా ప్రస్తావించారు.

బీసీసీఐ మహిళా క్రికెట్‌కు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు వినోద్‌రాయ్‌. 2006 వరకు మహిళా క్రికెటర్లపై వివక్ష దారుణంగా ఉండేదన్నారు. వాళ్లు మ్యాచ్‌లు ఆడేది తక్కువ సంఖ్య కాబట్టి.. కొత్త జెర్సీలు ఎందకన్న కారణంతో… పురుషుల వాడిన జెర్సీలనే కట్‌ చేసి మళ్లీ కుట్టి వాటిని మహిళా క్రికెటర్లకు అందించేవారని రాశారు. కొన్నేళ్ల క్రితం వరకు మహిళా క్రికెట్‌ అంటే.. మిథాలీ రాజ్‌, జులన్‌ గోస్వామే. వారిద్దర్ని తప్ప వేరే వారిని గుర్తుపెట్టుకోలేదు. దీనికి కారణం టీమ్‌లో ఎక్కువ రోజులు నిలదొక్కుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు మంచి క్రికెటర్లు వచ్చారు. కాని గతంలో ఘోరాల వల్లే ఎక్కుమంది మహిళలకు క్రికెట్‌లో నిలదొక్కుకునే పరిస్థితి లేదంటున్నారు వినోద్‌ రాయ్‌. మహిళలకు ఇచ్చే జర్సీలు.. ఒక రకంగా మెన్స్‌ క్రికెట్‌లో వాడేసిన జెర్సీలను మహిళా క్రికెటర్లకు ఇచ్చారన్నారు వినోద్‌ రాయ్‌.

అయితే శరద్‌ పవార్‌ బీసీసీఐ అధ్యక్షుడిగా వచ్చాకా.. పరిస్థితి కొంత నయమైందన్నారు వినోద్‌ రాయ్‌. ఆయన మెన్స్‌, వుమెన్స్‌ క్రికెట్‌ను ఒకే దగ్గరకు చేర్చాలనే కొత్త ఆలోచనతో వచ్చారన్నారు. దానివల్ల మహిళా క్రికెటర్ల బతుకులు చాలావరకు బాగుపడ్డాయి. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ అనేది రావడం వల్ల వివక్ష కాస్త తగ్గింది. కానీ ఇప్పటికి ఎక్కడో ఒక చోట అది కొనసాగుతూనే ఉంది. అంతేకాదు వినోద్‌రాయ్‌ బుక్‌లో ఇంకాస్త డీప్‌గా బోర్డులోని విషయాలపై చర్చించారు. 2017లో బీసీసీఐ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నప్పుడు.. భారత మహిళల జట్టు 2017 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్‌ చేరింది. ఆ ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 171 పరుగుల భారీ ఇన్నింగ్స్‌ టీమిండియాను ఫైనల్లో అడుగుపెట్టేలా చేసింది. అయితే ఇంత మంచి ఇన్నింగ్స్‌ ఆడిన హర్మన్‌ ప్రీత్‌కౌర్‌కు మ్యాచ్‌కు ముందు సరైన తిండి కూడా లేదు. ఆ విషయం హర్మన్‌ స్వయంగా వినోద్‌రాయ్‌తో చెప్పింది. ఆ భారీ ఇన్నింగ్స్‌ తర్వాత హర్మన్‌తో ఫోన్‌లో మాట్లాడారు వినోద్‌ రాయ్‌. ఎగ్జాట్‌గా ఆమె ఏమందంటే.. సార్‌.. పరిగత్తడానికి శక్తి లేక బలాన్ని సేవ్‌ చేసుకోడానికి సిక్స్‌లతోనే ఇన్నింగ్స్‌ ఆడాను. దానికి కారణం మాకు సరైన ఫుడ్‌ లేకపోవడమే. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు మేమున్న హోటల్‌ సిబ్బంది.. ఈరోజు మీకు బ్రేక్‌ఫాస్ట్‌ ఏం లేదని.. సమోసాలతోనే సరిపెడుతున్నామని చెప్పారు. ఆ ఒ‍క్క సమోసాతోనే నా శక్తినంతా కుంగదీసుకొని ఇన్నింగ్స్‌ ఆడానంటూ వినోద్‌ రాయ్‌తో జరిగిన సంఘటన మొత్తం వివరించింది.

మహిళా క్రికెట్‌ అంటే బీసీసీఐకి ఎప్పటికీ చిన్నచూపే. డబ్బే పరమావధి కావడంతో వారితో ఎక్కువ మ్యాచ్‌లు ఆడించరు. నాసిరకం పిచ్‌లపైనే ఆటలు కానిచ్చేస్తారు. మహిళా క్రికెట్‌ను ఎలా అభివృద్ధి చేయాలి? టాలెంట్‌ హంట్‌.. కిందిస్థాయి క్రికెటర్లను ప్రోత్సహించడం వంటి కీలక విషయాలపై దృష్టిపెట్టట్లేదు బీసీసీఐ. మెన్స్ క్రికెట్‌లో పెద్ద టీమ్‌లతో భారీ టోర్నీలు పెడుతూ… చిన్న టీమ్‌లతో ఒకటి రెండు మ్యాచ్‌లు ఆడిస్తారు. అంతా డబ్బుకోసమే. పెద్ద టీమ్‌తో టోర్నీలు ఆడితే ఎక్కువమంది ప్రేక్షకులు వస్తారు.. టీవీ శాటిలైట్‌ రైట్స్‌, డిజిటల్‌ రైట్స్‌ భారీ స్థాయిలో అమ్ముకోవచ్చు. ఇక ఐపీఎల్‌ గురించి అయితే చెప్పనక్కర్లేదు. కాసుల టోర్నీ ఇది. సున్నా పెట్టుబడితో వేల కోట్ల రూపాయల బిజినెస్‌ ఇక్కడ జరుడుతోంది. అలాంటి ఐపీఎల్‌ పురుషులకేనా? మహిళలకు లేదా? ఆస్ట్రేలియాలో ఇదే తరహాలో జరిగే బిగ్‌బాష్‌ లీగ్‌ మెన్స్‌, వుమెన్స్‌ అంటూ రెండు కేటగిరీల్లోనూ నిర్వహిస్తున్నారు. మరి అంతకన్నా పెద్ద బోర్డు, పెద్ద ప్లేయర్లున్న బీసీసీఐ మహిళలకు ఎందుకు ఐపీఎల్‌ లేదు? ఈ విషయం ఎంతోమంది ఎన్నోసార్లు బీసీసీఐని అడిగారు. ఎప్పటికప్పుడు తప్పించుకోవడమే కాని సరైన సమాధానం ఎన్నడూ రాలేదు. కోవిడ్‌ ముందు మహిళలకు ఒకట్రెండు మ్యాచ్‌లైనా ఉండేవి. ఇప్పుడు అవికూడా లేవు.

గతంలో మహిళా క్రికెట్‌లో ఓ వివాదం కూడా జరిగింది. మహిళా జట్టుకు కోచ్‌గా ఉన్న రమేష్‌ పొవార్‌.. సీనియర్‌ క్రికెటర్‌ అయిన మిథాలీరాజ్‌ని అకారణంగా జట్టునుంచి తొలగించారు. కీలకమైన టీ20 వరల్డ్‌ కప్‌లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కప్‌ కూడా గెలవలేకపోయింది మన మహిళల జట్టు. సెమీస్‌ నుంచే ఇంటిదారిపట్టింది. ఈ ఘటనపైనా వినోద్‌ రాయ్‌ స్పందించారు. మ్యాచ్‌ టాస్‌కి వెళ్లే కొన్ని క్షణాల ముందు మిథాలీకి ఈ విషయాన్ని చెప్పి ఆమెను తీవ్రంగా అవమానించారన్నారు. అదే పురుషుల క్రికెట్‌లో ఇలాంటి ఘటన జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకోలేం.

ఇప్పుడు మహిళా క్రికెటర్లు కాస్త హుందాగా ఉండగలుగుతున్నారు. బీసీసీఐ నుంచి వారికి అందే శాలరీ పెరగడం.. కిట్లు, జెర్సీలు, యాక్ససరీస్‌ మంచివి ఇస్తుండడంతో వారి ఆటతీరు కూడా మెరుగుపడుతోంది. ఇటీవల జరిగిన వరల్డ్‌ కప్‌లో అద్భుత పోరాటాన్ని కనబర్చగలిగారు. ప్రస్తుతం టీమిండియా మహిళా క్రికెటర్లలో స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, షఫాలీ వర్మ, దీప్తి శర్మ శిఖా పాండే వంటి యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ క్రికెటర్లున్నారు. రాబోయే కాలంలో వీరి స్ఫూర్తితో మరింతమంది టాప్‌ క్రీడాకారిణులు వచ్చే అవకాశాలు ఎంతైనా ఉంది.

మహిళా క్రికెట్ అంటే జెండర్‌ వేరు కాని.. ఆట ఒకటే. పురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా మహిళలు క్రికెట్‌లో రాణిస్తున్నారు. భారీ ఇన్నింగ్స్‌ ఆడుతున్నారు. భారీ షాట్లతో అలరిస్తున్నారు. బౌలింగ్‌, ఫీల్డింగ్‌ వంటి విభాగాల్లోనూ అద్భుతంగా పెర్ఫామ్‌ చేస్తున్నారు. మహిళలకు సరైన గౌరవం ఇస్తే.. దేశం గర్వపడేలా చేయగలరు.

Also Read: ఐపీఎల్‌లో అరంగేట్రం.. 4 బంతుల్లో మ్యాచ్‌నే మలుపు తిప్పాడు.. ఈ 75 లక్షల ప్లేయర్ ఎవరో తెలుసా?

IPL 2022: ఆటా పాయే.. కోట్లు పాయే.. కొంప ముంచిన రిటైన్ ఆటగాళ్లు.. లిస్టులో ఎవరున్నారంటే?

వావ్ !! ఆటోవాలా ఐడియా అదుర్స్.. ప్రయాణికుల కోసం భలే ఫ్లాన్ చేశాడు
వావ్ !! ఆటోవాలా ఐడియా అదుర్స్.. ప్రయాణికుల కోసం భలే ఫ్లాన్ చేశాడు
క్రెటా ఈవీతో పెట్రోల్ ఖర్చుకు టాటా..!
క్రెటా ఈవీతో పెట్రోల్ ఖర్చుకు టాటా..!
ఆలోచనలు మారుతున్నాయా.? భారీ ఈవెంట్స్ ఆంధ్ర బాట పట్టనున్నాయా.?
ఆలోచనలు మారుతున్నాయా.? భారీ ఈవెంట్స్ ఆంధ్ర బాట పట్టనున్నాయా.?
ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే.. 15 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!
ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే.. 15 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల ఫేవరేట్..
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల ఫేవరేట్..
ఇక మీ చేతిపైనే గుండె డాక్టర్..ఈసీజీ ఫీచర్‌తో నయా స్మార్ట్‌వాచ్..!
ఇక మీ చేతిపైనే గుండె డాక్టర్..ఈసీజీ ఫీచర్‌తో నయా స్మార్ట్‌వాచ్..!
పెళ్లికి ముందు మంచి పనికి శ్రీకారం చుట్టిన పుష్ప జాలిరెడ్డి
పెళ్లికి ముందు మంచి పనికి శ్రీకారం చుట్టిన పుష్ప జాలిరెడ్డి
హ్యుందాయ్‌ క్రెటా.. రూ.13.42 లక్షల కారు.. కేవలం రూ.5.72 లక్షలకే..
హ్యుందాయ్‌ క్రెటా.. రూ.13.42 లక్షల కారు.. కేవలం రూ.5.72 లక్షలకే..
బ్యాక్‌లాగ్ ఎగ్జామ్‌ రాసేందుకు వచ్చి ఎంత పని చేశాడు...
బ్యాక్‌లాగ్ ఎగ్జామ్‌ రాసేందుకు వచ్చి ఎంత పని చేశాడు...
ఐఫోన్ 16పై బంపర్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అదిరే తగ్గింపులు
ఐఫోన్ 16పై బంపర్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అదిరే తగ్గింపులు