- Telugu News Photo Gallery Cricket photos IPL 2022 Retained players struggling for form like rohit kohli siraj
IPL 2022: ఆటా పాయే.. కోట్లు పాయే.. కొంప ముంచిన రిటైన్ ఆటగాళ్లు.. లిస్టులో ఎవరున్నారంటే?
IPL 2022లో రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు ఆయా టీంలకు భారీ షాకిచ్చారు. వీరు ఇప్పటివరకు తమ ప్రదర్శనతో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.
Updated on: Apr 19, 2022 | 5:37 PM

ఐపీఎల్ 2022లో సగం మ్యాచ్‌లు అయిపోయాయి. అయితే, ఈ ప్రయాణంలో ఎంతోమంది ఆటగాళ్ల సత్తా చాటగా, మరికొంత మంది మాత్రం అంచనాలను అందుకోలేకపోయారు. ముఖ్యంగా IPL 2022 మెగా వేలానికి ముందు టీమ్‌లు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల గురించి మాట్లాడితే మాత్రం తీవ్రంగా నిరాశే ఎదురవుతోంది. IPL 2022 సగం ప్రయాణంలో వీరు ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారు. రిటైన్ చేసిన చాలా మంది ఆటగాళ్లే ఎక్కువగా ఉండడం జట్లను తీవ్రంగా నిరాశకు గురి చేస్తోంది.

విరాట్ కోహ్లీ: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2022 కోసం రూ. 15 కోట్లు చెల్లించి విరాట్ కోహ్లీని అట్టిపెట్టుకుంది. కానీ, మొదటి 6 మ్యాచ్‌లలో కోహ్లీ బ్యాటింగ్ సగటు 23.80కాగా, స్ట్రైక్ రేట్ 126.26గా నిలిచింది.

రోహిత్ శర్మ: రోహిత్ శర్మ IPLలో అత్యంత విజయవంతమైన సారథిగా నిలిచాడు. 5 టైటిల్స్ గెలిచిన ఘనత ముంబై ఇండియన్స్‌కే దక్కింది. అయితే, 2022లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన ముంబై, ఒక్క మ్యాచ్ గెలవలేకపోయింది. ఇక రోహిత్ మాత్రం బ్యాడ్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఆయన బ్యాటింగ్ సగటు 19, స్ట్రైక్ రేట్ 129. 54తో తీవ్రంగా నిరాశపరిచాడు.

వెంకటేష్ అయ్యర్: IPL 2021 UAE పార్ట్‌లో వెంకటేష్ అయ్యర్ స్టార్‌గా అవతరించారు. అదే ప్రదర్శనను బెంచ్‌మార్క్‌గా పరిగణించి, కోల్‌కతా నైట్ రైడర్స్ వెంకటేష్‌ను నిలబెట్టుకుంది. కానీ, తొలి 7 మ్యాచ్‌ల్లో 18.16 సగటుతో, 102.83 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించి, నిరాశపరిచాడు.

మొయిన్ అలీ: ఒక విధంగా ఫాఫ్ డు ప్లెసిస్‌ను త్యాగం చేయడం ద్వారా, చెన్నై సూపర్ కింగ్స్ అలీని రిటైన్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే, ఈ నిర్ణయం తప్పని వారికి తెలిసింది. లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌లలో, మొయిన్ అలీ బ్యాటింగ్ సగటు 17.40కాగా, స్ట్రైక్ రేట్ 124.28గా నిలిచింది. ఈ సమయంలో 8.50 ఎకానమీతో బౌలింగ్ చేసి, ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు.

మహ్మద్ సిరాజ్: RCB గత ప్రదర్శన ఆధారంగా విరాట్ కోహ్లీతో పాటు మహ్మద్ సిరాజ్‌ను రిటైన్ చేసింది. ఐపీఎల్ 2022లో ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఈ సమయంలో అతని బౌలింగ్ సగటు 49.20 కాగా ఎకానమీ రేటు 10.25గా నిలిచింది.

అక్షర్ పటేల్: ఈ స్పిన్ ఆల్ రౌండర్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ భారీ అంచనాలు పెట్టుకుంది. అయితే అక్షర్ తన స్పిన్‌తో ఢిల్లీకి ఎలాంటి ప్రయోజనం కలిగించలేకపోయాడు.




