- Telugu News Photo Gallery Cricket photos IPL 2022 Auction david miller was unsold in first round auction gujarat titans shows faith
IPL 2022 వేలంలో అతడిని ఎవరూ కొనాలనుకోలేదు.. కానీ ఇప్పుడు అందరి దృష్టి అతడిపైనే..!
IPL 2022:IPL 2022లో గుజరాత్ టైటాన్స్ అత్యుత్తమ ప్రదర్శన కొనసాగుతోంది. ఆదివారం హార్దిక్ పాండ్యా జట్టులో లేకున్నా చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది.
Updated on: Apr 18, 2022 | 6:34 PM

IPL 2022లో గుజరాత్ టైటాన్స్ అత్యుత్తమ ప్రదర్శన కొనసాగుతోంది. ఆదివారం హార్దిక్ పాండ్యా జట్టులో లేకున్నా చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. గుజరాత్ విజయానికి 170 పరుగులు చేయాల్సి ఉంది. దీంతో ఆ జట్టు 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. తర్వాత డేవిడ్ మిల్లర్ 51 బంతుల్లో అజేయంగా 94 పరుగులు చేసి ఒక బంతి ఉండగానే గుజరాత్ టైటాన్స్‌కు విజయాన్ని అందించాడు.

గుజరాత్‌కి చెందిన ఈ బ్యాట్స్‌మెన్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. డేవిడ్ మిల్లర్ స్ట్రైక్ రేట్ 184 కంటే ఎక్కువ. గుజరాత్‌కు కెప్టెన్‌గా ఉన్న రషీద్ ఖాన్‌తో కలిసి 37 బంతుల్లో 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

IPL 2022 వేలం మొదటి రౌండ్‌లో డేవిడ్ మిల్లర్‌ని ఎవరు కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. కానీ రెండో రౌండ్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్రయత్నించింది. కానీ కుదరలేదు.

చివరకి గుజరాత్ టైటాన్స్ రంగంలోకి దిగి 3 కోట్లకు మిల్లర్‌ని దక్కించుకుంది. ఇప్పుడు అతడి అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది.

గుజరాత్ టైటాన్స్‌కు చెందిన రషీద్ ఖాన్, డేవిడ్ మిల్లర్ వికెట్ల మధ్య వేగంగా పరుగులు సాధించారు.



