Summer Health: శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా.. ఆలస్యం చేస్తే తీవ్ర ప్రమాదం..
కొన్నిసార్లు ఇది తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. శరీరం నిర్జలీకరణ సంకేతాలను ఇస్తూనే ఉంటుంది. మనం వాటిపై శ్రద్ధ చూపించం. వేసవిలో డీహైడ్రేషన్ లక్షణాలు ఎలా ఉంటాయి, దాని నివారణకు ఎలాంటి పద్ధతులు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండాకాలం(Summer)లో చాలా మంది డీహైడ్రేషన్(de hyphenation)తో బాధపడుతుంటారు. అయితే, దీని గురించి కొంతమందికి తెలియకపోవడం విచారకరం. కొన్నిసార్లు ఇది తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. శరీరం నిర్జలీకరణ సంకేతాలను ఇస్తూనే ఉంటుంది. మనం వాటిపై శ్రద్ధ చూపించం. వేసవిలో డీహైడ్రేషన్ లక్షణాలు ఎలా ఉంటాయి, దాని నివారణకు ఎలాంటి పద్ధతులు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో శరీరంలోని జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. కాబట్టి ఈ సీజన్‌లో వేయించిన లేదా భారీ ఆహారాన్ని తినొద్దు. దోసకాయ, సీతాఫలం, పుచ్చకాయ, పొట్లకాయ, గుమ్మడి, కిచడీ వంటి తేలికగా జీర్ణమయ్యే వాటిని తింటే మంచింది.
దాహం వేస్తే వెంటనే తాగాలి..
వేసవిలో హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్, కళ్లు తిరగడం, తలనొప్పి వంటి సాధారణ సమస్యలు శరీరంలో నీటి కొరతను సూచిస్తాయి. ఇలాంటప్పుడు దాహం వేసినప్పుడు నీళ్లు తాగడం మంచింది. దాహం వేసే వరకు వేచి ఉండకుండా నీరు తాగడం అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. దాని ప్రభావం చర్మం, ఆరోగ్యంపై చూపడం ప్రారంభమవుతుంది. చాలా మంది వేసవిలో బయటి నుంచి వచ్చినప్పుడు తలనొప్పి వస్తుందని ఫిర్యాదు చేస్తుంటారు. ఇది కూడా శరీరంలో నీరు లేకపోవడాన్ని సూచిస్తుంది. వేడిని నివారించడానికి రోజంతా ఏసీలో గడిపేస్తుంటారు. దీని కారణంగా వారికి తక్కువ దాహం అనిపిస్తుంది. దీంతో నీరు తాగటం మర్చిపోతారు. ఇది డీహైడ్రేషన్ సమస్యకు దారితీస్తుంది.
శరీరంలో తేమను నిల్వ చేస్తాయి..
మన శరీరం మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ నీటితో తయారైంది. ఇది చర్మంలో తేమను దాచుకుంటుంది. కీళ్ళు, కళ్ళను ద్రవపదార్థంతో కప్పి ఉంచేలా చేస్తుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది. శరీరం నుంచి మలినాలను తొలగిస్తుంది. నీటి కొరత శరీర సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది అనేక వ్యాధులకు దారితీస్తుంది. ముఖ్యంగా వేసవిలో శరీరంలో నీటి కొరత ఉండకూడదు. వ్యాయామం చేసేటప్పుడు వాంతులు, విరేచనాలు, విపరీతమైన చెమట, ఈ కారణాల వల్ల శరీరంలో నీటి కొరత కూడా ఓ కారణం కావొచ్చు.
నిర్జలీకరణ లక్షణాలు..
దాహం, తల తిరగడం, తలనొప్పి, అలసట, నీరసం, అజీర్తి, తక్కువ లేదా ఆలస్యంగా మూత్రవిసర్జన చేయడం, పొడి చర్మం, పెదవులు పగిలిపోవడం నిర్జలీకరణం ప్రారంభ లక్షణాలు. నీటి కొరత ఉన్నప్పుడు శరీరం మనకు ఇలాంటి సంకేతాలను ఇస్తుంది. కానీ వాటిని విస్మరించడం మాత్రం మరింత ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉంది. నీరు, పండ్ల రసాలు, నీళ్లతో కూడిన దోసకాయ, సీతాఫలం, పుచ్చకాయ మొదలైన వాటిని ఆహారంలో తీసుకోవాలి.
వేసవిలో డీహైడ్రేషన్‌ను చెక్క పెట్టండిలా..
వేసవిలో ఎల్లవేళలా ఏసీలో ఉండడం వల్ల చర్మం పొడిబారడంతోపాటు శరీరంలో నీటి కొరత ఏర్పడవచ్చు. ఎందుకంటే ఏసీలో ఉండడం వల్ల దాహం వేయదు. తక్కువ నీరు తాగుతారు. 24 గంటలూ ఏసీలో ఉండడం మానుకోండి. నీళ్లు తాగడం కూడా మర్చిపోకండి. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా నీరు తాగండి. మీతో పాటు నీటిని తీసుకెళ్లండి. అలాగే ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నీరు తాగండి. ఇంకా కావాలంటే సబ్జాను ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇది చాలా కాలం పాటు శరీరంలోని నీటిని కలిగి ఉంటుంది. వేసవిలో శరీరంలోని జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. కాబట్టి ఈ సీజన్‌లో వేయించిన లేదా భారీ ఆహారాన్ని తినొద్దు. దోసకాయ, సీతాఫలం, పుచ్చకాయ, పొట్లకాయ, గుమ్మడి, కిచడీ వంటి తేలికగా జీర్ణమయ్యే వాటిని తినండి. పండ్ల రసం, పెరుగు, మజ్జిగ, సలాడ్‌లను క్రమం తప్పకుండా తీసుకోవాలి. వేసవిలో ఎట్టి పరిస్థితుల్లోనూ శరీరంలో నీటి కొరత లేకుండా చూసుకోవాలి. దీంతో వేసవిలో సులభంగా ఆరోగ్యంగా ఉండొచ్చు.
Also Read: Immunity Smoothie: రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందా? అయితే బొప్పాయితో ఇలా చేయండి..
Peanut Side Effects: వేరుశెనగ తింటే మంచిదే.. కానీ ఈ సమస్యలు ఉన్నవారు అస్సలు తినకూడదు..