AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister KTR: విద్యాసంస్థల కేటాయింపుల్లోనూ తెలంగాణ ఊసే లేదు.. కేంద్ర ప్రభుత్వ విధానాలపై మంత్రి కేటీఆర్‌ ఫైర్..

కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామరావు(Minister KTR). కేంద్ర ప్రభుత్వ విధానాలపై మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా విమర్శలు కొనసాగిస్తున్నారు. విద్యాసంస్థల కేటాయింపులో..

Minister KTR: విద్యాసంస్థల కేటాయింపుల్లోనూ తెలంగాణ ఊసే లేదు.. కేంద్ర ప్రభుత్వ విధానాలపై మంత్రి కేటీఆర్‌ ఫైర్..
Sanjay Kasula
|

Updated on: Apr 20, 2022 | 5:27 PM

Share

కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామరావు(Minister KTR). కేంద్ర ప్రభుత్వ విధానాలపై మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా విమర్శలు కొనసాగిస్తున్నారు. విద్యాసంస్థల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మొండిచేయి చూపిందని బుధవారం తన ట్విటర్‌లో విరుచుకుపడ్డారు. మోదీ సర్కారు ఏడు ఐఏఎంలను దేశవ్యాప్తంగా మంజూరు చేసినప్పటికీ తెలంగాణకు ఇచ్చిందేంటని ప్రశ్నించారు. కేవలం రిక్తహస్తాలు మాత్రమే చూపిందన్నారు. ఏడు ఐఐటీల్లో రాష్ట్రానికి ఒక్కటి కూడా దక్కకపోవడం చాలా శోచనీయమన్నారు. మిగతా విద్యాసంస్థల కేటాయింపుల్లోనూ తెలంగాణ ఊసే లేదని మంత్రి కేటీఆర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్‌ఐటీలు 4, మెడికల్‌ కళాశాలలు 157, నవోదయాలు 84 వివిధ రాష్ట్రాలకు కేటాయించినప్పటికీ తెలంగాణకు చోటు ఇవ్వలేదన్నారు.

రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం హామీని కేంద్ర ప్రభుత్వం విస్మరించారన్న మంత్రి.. తెలంగాణపై వివక్ష కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వచ్చిన సంప్రదాయ వైద్య కేంద్రం యథావిథిగా గుజరాత్‌కు తరలిపోయిందన్నారు. ఈ వైద్య కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు గతంలో కిషన్‌రెడ్డి చేసిన ట్వీట్‌ను కేటీఆర్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఇవి కూడా చదవండి: Eatala Rajender: టీఆర్ఎస్ దౌర్జన్యాలపై సీబీఐ విచారణ జరపాలి.. సాయి గణేష్ కుటుంబానికి ఈటల పరామర్శ..