Healthy Sweeteners: చెక్కరకు బదులు వీటిని ఉపయోగించండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి..!

Healthy Sweeteners: జీవితంలో తీపి లేకుంటే అసలు టేస్టే ఉండదు. అలాగని ఇబ్బడిముబ్బడిగా స్వీట్స్ తింటే.. మధుమేహం, ఊబకాయం వంటి...

Healthy Sweeteners: చెక్కరకు బదులు వీటిని ఉపయోగించండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి..!
Sugar
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 20, 2022 | 10:49 PM

Healthy Sweeteners: జీవితంలో తీపి లేకుంటే అసలు టేస్టే ఉండదు. అలాగని ఇబ్బడిముబ్బడిగా స్వీట్స్ తింటే.. మధుమేహం, ఊబకాయం వంటి ప్రాణాంతక వ్యాధులతో జీవితాంతం పోరాడాల్సి వస్తుంది. పుట్టిన రోజున కేక్ తిన్నా.. సినిమా చూస్తూ పాప్ కార్న్, కోలా ఆస్వాధించినా.. ప్యాక్‌డ్ ఫ్రూజ్ జ్యూస్ తాగినా అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐస్ క్రీమ్, వేడి వేడి జిలేబీలు, కోలా తాగితే.. అందులోని షుగర్ కంటెంట్ వెంటనే శరీరంలోకి ప్రసరణ అవుతుంది. కాలక్రమేనా అది మధుమేహం, గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు, క్యాన్సర్ వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఈ సమస్యలన్నీ కృతిమ చక్కెరల ద్వారా వస్తుంది. ఈ షుగర్ కంటెంట్ ద్వారా లేనిపోని రోగాలు కొనితెచ్చుకోవడం కంటే.. సహజమైన తీపి పదార్థాలను తినడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఆ సహజసిద్ధమైన తీపి పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సేంద్రీయ బ్రౌన్ షుగర్: ఆహార తయారీలో శుద్ధి చేసిన తెల్ల చక్కెరకు ప్రత్యామ్నాయంగా బ్రౌన్ షుగర్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. చెరకులో ఉండే పోషకాలన్నింటినీ నిలుపుకునేలా ఈ బ్రౌన్ షుగర్ ఉంటుంది. దీని నుంచి వేడి వేడి పానియాలు, డేజర్ట్స్, సాంప్రదాయ స్వీట్స్ తయారు చేసుకోవచ్చు.

కొబ్బరి/ఫామ్ షుగర్: కొబ్బరి, ఫామ్ షుగర్ అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన మరొక సహజ స్వీటెనర్. ఇది కొబ్బరి చెట్టు పూల మొగ్గల నుంచి తయారవుతుంది. ప్రాసెస్ చేసిన చక్కెరతో పోలిస్తే.. తక్కువ ఫ్రక్టోజ్ కంటెంట్ కలిగి ఉంటుంది. దాంతోపాటు తక్కువ గ్లైసెమిక్ సూచనలు కలిగి ఉంటుంది.

ఖర్జూర చక్కెర: ఖర్జూరాన్ని పురాతన కాలం నుండి సాంప్రదాయ స్వీట్లలో ఉపయోగిస్తారు. ఇది అత్యంత పోషకాలు కలిగిన సహజ స్వీటెనర్‌లలో ఒకటిగా పేరు పొందింది. ఎండిన, మెత్తగా పొడి చేసిన ఖర్జూరం నుండి తయారైన ఖర్జూర చక్కెర కూడా నిర్విషీకరణలో సహాయపడుతుంది.

బెల్లం: మరొక చెరకు ఆధారిత సహజ స్వీటెనర్ బెల్లం. ఇది చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది. సులభంగా, సమృద్ధిగా దొరుకుతుంది. బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫిట్‌నెస్ ఔత్సాహికులు దీన్ని ఇష్టపడతారు.

ఫారెస్ట్ తేనె: తేనెటీగల నుండి నేరుగా సేకరించిన ముడి తేనె అటవీ తేనెగా మార్కెట్లలో లభిస్తుంది. దీనిని ప్రాసెస్ చేయరు. సహజమైన తీపి పదార్థం.

Also read:

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రజలకు ‘కూల్’ న్యూస్.. రాబోయే మూడు రోజులు..

Andhra Pradesh: పూజారితో తన్నించుకునేందుకు బారులు తీరిన భక్తులు.. ఆ ఆలయ ప్రత్యేకతే వేరు..!

World Liver Day 2022: కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఇప్పుడే తెలుసుకోండి..

చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!