AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: త్వరగా బరువు తగ్గాలంటే నల్లమిరియాలని ఇలా వాడండి..!

Health Tips: చాలామంది బరువు తగ్గడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తారు. కానీ ఎటువంటి ఫలితం ఉండదు. కానీ ఇంట్లో లభించే నల్లమిరియాలతో సులువుగా

Health Tips: త్వరగా బరువు తగ్గాలంటే నల్లమిరియాలని ఇలా వాడండి..!
Black Pepper
uppula Raju
| Edited By: Phani CH|

Updated on: Apr 21, 2022 | 8:08 AM

Share

Health Tips: చాలామంది బరువు తగ్గడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తారు. కానీ ఎటువంటి ఫలితం ఉండదు. కానీ ఇంట్లో లభించే నల్లమిరియాలతో సులువుగా బరువు తగ్గవచ్చు. ఈ విషయం వింటే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. కానీ ఇది నిజం. వాస్తవానికి నల్లమిరియాలని ఆహారం రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. కానీ దీనిని చాలా సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో వినియోగిస్తున్నారు. ఇది అనేక వ్యాధులలో ఉపయోగపడుతుంది. ఔషధాల తయారీలో కూడా వాడుతారు. బరువు తగ్గాలని ప్రయత్నించేవారు నల్లమిరియాలని తప్పనిసరిగా డైట్‌లో చేర్చుకోవాలి. నల్ల మిరియాల వల్ల కఫం, దగ్గు, జలుబు నయం అవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నల్ల మిరియాలు ఆరోగ్యకరమైన కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు, డైటరీ ఫైబర్ కలిగి ఉంటాయి. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో పైపెరిన్ అని పదార్థం ఉంటుంది. ఇది జీవక్రియను ఎంతగానో దోహదపడుతుంది.

మీరు బరువు తగ్గడానికి నల్లమిరియాల టీ తాగవచ్చు. ఇందులో అల్లం, తేనె, తులసి, దాల్చిన చెక్క, నిమ్మ, గ్రీన్ టీ బ్యాగ్‌లను ఉపయోగించవచ్చు. ఇది కాకుండా మీరు ఏదైనా కూరగాయ సూప్‌లో కూడా నల్ల మిరియాలు కలుపుకొని తాగవచ్చు.

నల్లమిరియాల టీ బ్రేక్ ఫాస్ట్‌కి ముందు తీసుకోవాలి. దీని వల్ల మీరు మరింత ప్రయోజనం పొందుతారు. ఇది కాకుండా మీరు నల్ల మిరియాలు నేరుగా తినాలని ఆలోచిస్తున్నట్లయితే పరగడుపున తింటే మంచి ఫలితాలు ఉంటాయి. ఒక గ్లాసు పండ్ల రసంలో నల్లమిరియాలు కలుపుకొని కూడా తాగవచ్చు. దీంతో బరువు సులభంగా తగ్గుతారు.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Small Savings Schemes: చిన్న పొదుపు పథకాలని ఉపయోగించుకోండి.. మంచి లాభాలని ఆర్జించండి..!

Health Tips: కొలస్ట్రాల్‌ తగ్గాలంటే ఈ ఆహార చిట్కాలు పాటించండి..!

DC vs PBKS: పంజాబ్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ సూపర్ విక్టరీ.. హాఫ్ సెంచరీతో రాణించిన డేవిడ్‌ వార్నర్..