Small Savings Schemes: చిన్న పొదుపు పథకాలని ఉపయోగించుకోండి.. మంచి లాభాలని ఆర్జించండి..!
Small Savings Schemes: చిన్న పొదుపు పథకాలు భారీ రాబడిని అందించవు. కానీ క్రమశిక్షణతో చేసే పొదుపు భవిష్యత్‌లో మీకు అండగా నిలుస్తుంది. చిన్న పొదుపు
Small Savings Schemes: చిన్న పొదుపు పథకాలు భారీ రాబడిని అందించవు. కానీ క్రమశిక్షణతో చేసే పొదుపు భవిష్యత్‌లో మీకు అండగా నిలుస్తుంది. చిన్న పొదుపు పథకాలపై అందించే వడ్డీ రేట్లని ప్రభుత్వం త్రైమాసిక ప్రాతిపదికన సవరిస్తుంది. పోస్ట్ ఆఫీస్‌లో అనేక చిన్న పొదుపు పథకాలు ఉన్నాయి. బ్యాంక్ డిఫాల్ట్ అయితే మీరు రూ. 5 లక్షలు మాత్రమే తిరిగి పొందుతారు. కానీ పోస్టాఫీసులో అలా కాదు ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది. అంతేకాదు పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు చాలా తక్కువ మొత్తంతో ప్రారంభించవచ్చు. ఇండియా పోస్ట్ అందించే వివిధ పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ , నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, సుకన్య సమృద్ధి యోజన అత్యంత ప్రజాదరణ పొందాయి. ప్రజలు పోస్టాఫీసులో ఈ ఖాతా తెరవడం ద్వారా మంచి రాబడులు పొందవచ్చు.
పబ్లిక్ ఫ్రావిడెంట్ ఫండ్
పబ్లిక్ ఫ్రావిడెంట్ ఫండ్ 15 ఏళ్ల దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళిక. రిస్క్ తీసుకోలేని వారికోసం ఇది చాలా బెస్ట్ స్కీం అని చెప్పవచ్చు. మెచ్యూరిటీ పీరియడ్ 15 ఏళ్లు కాగా ముందస్తు మూసివేతకు అవకాశం లేదు. 15 ఏళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత కావాలనుకుంటే మరో 5 ఏళ్లు ఖాతాను కొనసాగించుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టం 80సీ పన్ను మినహాయింపునకు అవకాశం కలదు. పెట్టుబడి పెట్టిన మూడో ఏట నుంచి రుణం పొందే సదుపాయం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ఈ పథకానికి సంవత్సరానికి 7.1 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీస పొదుపు రూ. 500 గరిష్ట పరిమితి రూ.1.5 లక్షలు.
నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్(ఎన్ఎస్‌సి)
NSCలో కనీస డిపాజిట్ రూ.1,000, అయితే గరిష్టం పరిమితి లేదు. ఈ డిపాజిట్లు ఆదాయపు పన్ను చట్టం 80 సీ కింద పన్ను మినహాయింపులు కలిగి ఉంటాయి. దీనిపై వార్షిక ప్రాతిపదికన వచ్చే వడ్డీని తిరిగి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఖాతాదారుడు చనిపోయినప్పుడు ఖాతాను మూసివేయవచ్చు. ఈ పథకం కాలపరిమితి ఐదేళ్లు. ప్రస్తుతం ప్రభుత్వం ఏటా 6.8 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అయితే మెచ్యూరిటీ సమయంలో పూర్తి వడ్డీ చెల్లిస్తారు.
సుకన్య సమృద్ధి యోజన
ఆడపిల్లల భవిష్యత్తును కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజనను ప్రారంభించింది. ఈ పథకం అందించే ప్రస్తుత వడ్డీ రేటు సంవత్సరానికి 7.6 శాతం. ఈ పథకంలో కనీస డిపాజిట్ రూ. 250, గరిష్ట పరిమితి ఆర్థిక సంవత్సరానికి రూ. 1.5 లక్షలు. ప్రారంభించిన తేదీ నుంచి 15 సంవత్సరాల పాటు డిపాజిట్లు చేయవచ్చు. అయితే ఈ ఖాతా ఆడపిల్ల పెళ్లి సమయంలో అంటే 21 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది.
గమనిక: ఇక్కడ అందిస్తున్న ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆర్ధిక నిపుణులు వెల్లడించిన అభిప్రాయాలు.. ఆయా కంపెనీల పనితీరుపై నిపుణులు అందించిన సమాచారం ఆధారంగా ఈ ఆర్టికల్ అందిస్తున్నాం. స్టాక్స్, ఫండ్స్, ఇన్సూరెన్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టేముందు ఆర్ధిక నిపుణుల సలహా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.