Credit Cards vs Personal Loan: క్రెడిట్ కార్డు వర్సెస్ పర్సనల్ లోన్.. ఈ రెండింటిలో ఏది బెటర్..!
Credit Cards vs Personal Loan: ప్రజలకి అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు ఎంచుకునే మార్గాలు రెండు. అందులో ఒకటి క్రెడిట్‌కార్డ్స్ మరొకటి పర్సనల్ లోన్.
Credit Cards vs Personal Loan: ప్రజలకి అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు ఎంచుకునే మార్గాలు రెండు. అందులో ఒకటి క్రెడిట్‌కార్డ్స్ మరొకటి పర్సనల్ లోన్. ఈ రెండింటి ద్వారా అవసరాలు తీర్చుకొని మళ్లీ వాటిని తిరిగి చెల్లించడమే. అయితే రెండింటిలో ఏది బెటర్ అనేది వారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంటుంది. అయితే చాలామంది ఉద్యోగులు, వ్యాపారులు క్రెడిట్ కార్డుపై ఆధారపడుతారు. ఎందుకంటే క్రెడిట్ కార్డ్‌లపై ఆఫర్లు, డిస్కౌంట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో చాలామంది వీటివైపు మొగ్గు చూపుతారు. క్రెడిట్ కార్డ్ ఆప్షన్ లేనివారు బ్యాంకులలో పర్సనల్ లోన్లపై ఆధారపడుతారు. ఏ బ్యాంకు తక్కువ వడ్డీపై రుణం మంజూరు చేస్తుందో తెలుసుకొని లోన్లు తీసుకుంటారు. వారి వెసులుబాటు ప్రకారం వాయిదాల పద్దతిలో రుణాలని తీరుస్తారు.
క్రెడిట్ కార్డ్ వల్ల లాభాలు
క్రెడిట్ కార్డులతో ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. అయితే తెలివిగా కార్డులను ఉపయోగిస్తేనే ఈ ప్రయోజనాలు పొందొచ్చు. లేదంటే చిక్కుల్లో పడతాం. క్రెడిట్ కార్డులను దాదాపుగా చాలా చోట్లు ఉపయోగించొచ్చు. చేతిలో డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి లావాదేవీలపై రివార్డు పాయింట్లను పొందొచ్చు. వీటిని రిడీమ్ చేసుకొని వోచర్లను పొందొచ్చు. ఏటీఎం క్యాష్ విత్‌డ్రా సదుపాయం కూడా ఉంది. ఏ బ్యాంక్ ఏటీఎంకు వెళ్లైనా డబ్బులు తీసుకోవచ్చు. 40 నుంచి 50 రోజుల వరకు వడ్డీ రహిత క్రెడిట్ సౌకర్యం ఉంది. ఎప్పుడు అవసరం అయినా కార్డును ఉపయోగించొచ్చు. స్మార్ట్‌ఫోన్, ఫ్రిజ్, టీవీ లేదంటే ఇతర ప్రొడక్టులు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసినప్పుడు, వాటిని ఈఎంఐ రూపంలోకి మార్చుకోవచ్చు.
పర్సనల్ లోన్ వల్ల లాభాలు
పర్సనల్ లోన్స్ అన్‌సెక్యూర్డ్ రుణాలు. అంటే మీరు ఎలాంటి తనఖా లేకుండానే రుణం పొందొచ్చు. అయితే వీటిపై వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. కొన్ని బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు ఎక్కువ వడ్డీ వసూలు చేస్తూ ఉంటాయి. అందుకే పర్సనలో లోన్ కోసం అప్లై చేసుకునే సమయంలో తక్కువ వడ్డీతో ఎవరైతే రుణాలు ఇస్తున్నారో అక్కడే తీసుకోవాలి. అయితే పర్సనల్ లోన్‌ను మీ ఆదాయంలో భాగంగా పరిగణించరు. సులువైన వాయిదాలలో లోన్ తీర్చే అవకాశం ఉంటుంది.
క్రెడిట్ కార్డు వర్సెస్ పర్సనల్ లోన్ మధ్య పోలిక
క్రెడిట్ కార్డ్ లేదా వ్యక్తిగత రుణం ద్వారా అవసరాలని తీర్చుకోవచ్చు. అయితే క్రెడిట్ కార్డు బిల్లు గడువు దాటిందంటే బ్యాంకులు అధిక వడ్డీని విధిస్తాయి. అంతేకాకుండా అంతర్జాతీయ కొనుగోళ్లు చేసినప్పుడు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. క్రెడిట్ కార్డులను తెలివిగా ఉపయోగిస్తూ, బిల్లు నిర్ణీత గడువులోగా క్రమం తప్పకుండా చెల్లిస్తూ వస్తే అప్పుడు క్రెడిట్ లిమిట్ పెరుగుతూ వస్తుంది. మరోవైపు పర్సనల్ లోన్ తీసుకొన్న వ్యక్తులు ఒకేసారి ఆ మొత్తాన్ని ఉపయోగించుకోవాలి. లోన్ మొత్తాన్ని మంజూరు చేయడానికి ముందు రుణగ్రహీత , రుణదాత మధ్య అంగీకరించిన షెడ్యూల్ ప్రకారం తిరిగి వాయిదాల ప్రకారం డబ్బును చెల్లించాలి. సక్రమంగా వాయిదాలలో నగదు చెల్లించలేక పోతే అదనంగా వడ్డీ వసూలు చేస్తారు.
గమనిక: ఇక్కడ అందిస్తున్న ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆర్ధిక నిపుణులు వెల్లడించిన అభిప్రాయాలు.. ఆయా కంపెనీల పనితీరుపై నిపుణులు అందించిన సమాచారం ఆధారంగా ఈ ఆర్టికల్ అందిస్తున్నాం. స్టాక్స్, ఫండ్స్, ఇన్సూరెన్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టేముందు ఆర్ధిక నిపుణుల సలహా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.