Viral Photo: ఈ ఫోటోలో ఎన్ని జంతువులు దాగున్నాయో చెప్పగలరా.? చాలా కష్టం!

ఆప్టికల్ ఇల్యూషన్.. ఇదొక కళ్లను మాయ చేసే కనికట్టు. వీటిల్లో పైకి కనిపించేది ఒకటయితే.. లోపల మరొకటి ఉంటుంది

Viral Photo: ఈ ఫోటోలో ఎన్ని జంతువులు దాగున్నాయో చెప్పగలరా.? చాలా కష్టం!
Optical Illusion
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 20, 2022 | 8:29 PM

ఆప్టికల్ ఇల్యూషన్.. ఇదొక కళ్లను మాయ చేసే కనికట్టు. వీటిల్లో పైకి కనిపించేది ఒకటయితే.. లోపల మరొకటి ఉంటుంది. కళ్లనే మభ్యపెట్టే ఈ చిత్రాలపై ఇటీవల నెటిజన్లు తెగ ఆసక్తిని చూపిస్తున్నారు. సవాళ్లను ఇష్టపడేవారు.. ఇలాంటి పజిల్స్‌ను ఓ పట్టు పడుతుంటారు. అందుకేనేమో సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఓ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలను మన కళ్లనే మోసం చేస్తున్నాయంటే.. అది కచ్చితంగా చిత్రకారుడి ప్రతిభను అద్దం పడుతుంది. ఇక తాజాగా ఇలాంటి ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దాన్ని చూసిన తర్వాత మీ మైండ్ బ్లాంక్ కావడం ఖాయం.

పైన పేర్కొన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో కొన్ని జంతువులు దాగున్నాయి. ఆ చిత్రంలో ఎన్ని జంతువులు ఉన్నాయి. అవేంటో మీరు చెప్పాలి. మొదటిసారి ఆ ఫోటోను చూసిన వెంటనే మీరు అందులో ఏనుగు, కుక్క, పిల్లి, గాడిద ఉన్నాయని కనిపెట్టేస్తారు. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఆ చిత్రం గీసిన కళాకారుడు.. ఓ జంతువులో మిగిలినవి ఇమిడిపోయినట్లు చేశాడు. తద్వారా మీరు మిగతా జంతువులను కనిపెట్టడం కాస్త కష్టపడాల్సి వస్తుంది.

మరోవైపు ఈ ఫోటోను చూసిన నెటిజన్లలో కొందరు.. ఇందులో 4 జంతువులు ఉన్నాయని చెబితే.. ఇంకొందరు 6 ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ ఫోటోను నిశితంగా చూడండి. అందులో ఎన్ని జంతువులు ఉన్నాయో చెప్పండి.

సమాధానం: 16(చేప, దోమ, గాడిద, బీవర్, కుక్క, మొసలి, స్వార్డ్ ఫిష్, రొయ్య, కోడి, తాబేలు, ఏనుగు, ష్రింప్, ఎలుక, పాము, డాల్ఫిన్, పిల్లి)