AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Portable AC: సామాన్యులకి అందుబాటులో పోర్టబుల్‌ ఏసీలు.. ఎక్కడైనా పెట్టొచ్చు.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు..!

Portable AC: గతంలో ఏసీ అంటే సంపన్నులు మాత్రమే ఉపయోగించేవారు. కానీ మారిన పరిస్థితుల వల్ల ఇప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చింది.

Portable AC: సామాన్యులకి అందుబాటులో పోర్టబుల్‌ ఏసీలు.. ఎక్కడైనా పెట్టొచ్చు.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు..!
Portable Ac
uppula Raju
|

Updated on: Apr 20, 2022 | 6:19 PM

Share

Portable AC: గతంలో ఏసీ అంటే సంపన్నులు మాత్రమే ఉపయోగించేవారు. కానీ మారిన పరిస్థితుల వల్ల ఇప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చింది. మధ్యతరగతి వాళ్లు కూడా ఏసీని ఉపయోగిస్తున్నారు. అయితే ఇల్లు చిన్నగా ఉన్నవారు లేదా అద్దె ఇంట్లో ఉండేవారు ఏసీని అమర్చుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఏసీ అనేది ఒక రూం వరకే పరిమితమై ఉంటుంది. కానీ ఇప్పుడు మార్కెట్‌లో పోర్టబుల్‌ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎక్కడైనా పెట్టొచ్చు.. అంతేకాకుండా ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు.. ఇంటి అవసరాన్ని బట్టి ఎక్కడైనా ఉపయోగించవచ్చు. మామూలు ఏసీతో పోల్చితే వీటి ధర కూడా తక్కువగా ఉంటుంది. సాధారణ ACలు చాలా బరువుగా ఉంటాయి. వాటిని గోడకు అమర్చాల్సి ఉంటుంది. పోర్టబుల్ ACలు ఎక్కువగా బరువు ఉండవు. చక్రాలు చిన్నగా ఉంటాయి. కానీ ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లొచ్చు. సౌండ్‌ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి నిద్రకు ఆటంకం ఉండదు. పోర్టబుల్ AC మీ గదిలో తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఈ AC వెనుక ఒక పొడవైన పైపు ఉంటుంది. అది వేడి గాలిని బయటకు పంపిస్తుంది. దాని సామర్థ్యాన్ని పరిశీలిస్తే అది అర టన్ను నుంచి 1.5 వరకు ఉంటుంది.

ప్రస్తుతం అన్ని కంపెనీలు పోర్టబుల్‌ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. బ్లూస్టార్ పోర్టబుల్ ఏసీ 35 వేల రూపాయలకే వస్తుంది. వోల్టాస్, ఫిలిప్స్, ఉషా వంటి కంపెనీలు కూడా పోర్టబుల్ ఏసీలను తయారు చేస్తున్నాయి. ఫిలిప్స్ సిరీస్‌కు చెందిన ఏసీ 25 ​వేల రూపాయలకు వస్తుంది. ఉష లాంటి సంస్థ ఈ ఏసీని 12 వేల రూపాయలకు అందిస్తుంది. పోర్టబుల్‌ ఏసీని మంచం దగ్గర పెట్టుకోవచ్చు. కుర్చీ పెట్టే స్థలంతో గది మొత్తాన్ని చల్లబరుస్తుంది. పోర్టబుల్ ఏసీ అద్దెకు నివసించే ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మీరు ఇంటిని మారవలసి వస్తే దీనిని సూట్‌కేస్ లాగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకెళ్లవచ్చు.

Good News: అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకి శుభవార్త.. ఆ సమయం భారీగా తగ్గించింది..

Steinway Tower: ప్రపంచంలో ఎత్తైన సన్నగా ఉండే బిల్డింగ్‌ ఇదే.. గాలి బలంగా వీస్తే ఎలా ఉంటుందంటే..!

Health News: కాలేయ వ్యాధి లివర్ సిర్రోసిస్ గురించి మీకు తెలుసా.. ఎవరికి ఎక్కువ ప్రమాదమంటే..?