- Telugu News Photo Gallery Worlds thinnest skyscraper named steinway tower in manhattan is finally complete and open to residents
Steinway Tower: ప్రపంచంలో ఎత్తైన సన్నగా ఉండే బిల్డింగ్ ఇదే.. గాలి బలంగా వీస్తే ఎలా ఉంటుందంటే..!
Steinway Tower: ప్రపంచంలో పేరు పొందిన భవనాలు చాలా ఉన్నాయి. బుర్జ్ ఖలీఫా గత కొన్నేళ్లుగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా దీనికి మరొక భవనం పోటీ వచ్చింది.
Updated on: Apr 20, 2022 | 1:01 AM

ప్రపంచంలో పేరు పొందిన భవనాలు చాలా ఉన్నాయి. బుర్జ్ ఖలీఫా గత కొన్నేళ్లుగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా దీనికి మరొక భవనం పోటీ వచ్చింది. ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని, పొడవైన భవనం. దీని ప్రత్యేకత ఏంటంటే గాలి బలంగా వీచిందంటే ఊగుతుంటుంది. అంతేకాదు ఇది చాలా ప్రమాదకరమైన భవనం కూడా. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

అమెరికాలోని మాన్‌హట్టన్‌లోని ఈ భవనం 1428 అడుగుల ఎత్తు ఉండగా, వెడల్పు 60 అడుగులు మాత్రమే. మీడియా నివేదికల ప్రకారం.. సెంట్రల్ పార్క్ టవర్, వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ తర్వాత ఇది యుఎస్‌లో మూడో ఎత్తైన భవనం.

ఈ భవనానికి స్టెయిన్‌వే టవర్ అని పేరు. ఇది ఒక అద్భుతమైన భవనం. ఈ భవనం ప్రపంచంలోనే అత్యంత బలమైన కాంక్రీటుతో నిర్మించారు.

84 అంతస్తుల ఈ భవనం బలమైన గాలికి ఊగుతుంది. మీడియా నివేదికల ప్రకారం గాలి 100 mph వేగంతో వీచినట్లయితే ఈ భవనం ఊగుతుంది. అయితే గాలికి బిల్డింగ్ ఊగుతున్న విషయం లోపల నివసించే వారికి తెలియకుండా దీన్ని తయారు చేశారు.

ఈ భవనంలో నివసించే వ్యక్తులు నగరంలోని అందమైన ప్రదేశాలని అక్కడి నుంచే చూడగలుగుతారు. కానీ ఇది చాలా ప్రమాదకరమైన భవనం. ఈ భవనంలో నివసించడం అంత సులభం కాదు. ఇందులో ఒక స్టూడియో అపార్ట్‌మెంట్ ఖరీదు $7.75 మిలియన్లు. ఒక పెంట్‌హౌస్ ధర $66 మిలియన్లు.





























