కోనసీమ జిల్లాలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. గత 35 రోజుల్లో రూ. 2.17 కోట్లు సమకూరాయి. నగదుతో పాటు 42 గ్రాముల బంగారం, కిలో వెండి, 13 దేశాల విదేశీ కరెన్సీ నోట్లను భక్తులు సమర్పించారు. భక్తుల సంఖ్య పెరగడమే ఆదాయ వృద్ధికి కారణమని దేవస్థానం పాలకమండలి హర్షం వ్యక్తం చేసింది.