Health News: కాలేయ వ్యాధి లివర్ సిర్రోసిస్ గురించి మీకు తెలుసా.. ఎవరికి ఎక్కువ ప్రమాదమంటే..?
Health News: కాలేయం మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. ఆహారాన్ని జీర్ణం చేయడమే కాకుండా ఇది షుగర్ కంట్రోల్, బాడీ డిటాక్స్‌గా పనిచేస్తుంది.
Health News: కాలేయం మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. ఆహారాన్ని జీర్ణం చేయడమే కాకుండా ఇది షుగర్ కంట్రోల్, బాడీ డిటాక్స్‌గా పనిచేస్తుంది. కాలేయంలో చిన్న సమస్య వచ్చినా అది శరీరం మొత్తంపై ప్రభావం చూపుతుంది. కాలేయ వ్యాధుల లక్షణాలు మొదట్లోనే కనిపిస్తాయి. కానీ చాలా మంది వాటిని విస్మరిస్తారు. దీని కారణంగా ఈ సమస్య తీవ్రంగా మారుతుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం అత్యంత ముఖ్యమైన కాలేయ వ్యాధి లివర్ సిర్రోసిస్. ఇది నెమ్మదిగా కాలేయాన్ని పాడుచేస్తుంది. ఇది రావడానికి గల కారణాలు ప్రజలకు తెలియదు. లివర్ సిర్రోసిస్ అంటే ఏంటి.. దానిని ఎలా నివారించాలో తెలుసుకుందాం. చెడు జీవనశైలి, ఒత్తిడి కారణంగా మనుషుల్లో కాలేయ వ్యాధులు పెరుగుతున్నాయి. డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం పది లక్షల మంది భారతీయులు లివర్ సిర్రోసిస్‌తో బాధపడుతున్నట్లు తేలింది. ఆహారం పట్ల శ్రద్ధ లేకపోవడం, చెడ్డ జీవనశైలి కారణంగా ఇది సంభవిస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారిలో కాలేయం క్రమంగా పాడైపోవడం జరుగుతుంది. ఇది సకాలంలో నియంత్రించకపోతే కాలేయం పూర్తి స్థాయిలో దెబ్బతినే అవకాశం ఉంటుంది. తీవ్రమైన సందర్భాల్లో కాలేయ మార్పిడి కూడా అవసరం కావచ్చు. లివర్ సిర్రోసిస్‌తో పాటు ఫ్యాటీ లివర్ సమస్య ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. సరైన సమయంలో డాక్టర్ వద్దకి వెళితే ఈ రోగాలని నయం చేయవచ్చు.
ఆరోగ్యకరమైన అలవాట్లు, రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు కాలేయ వ్యాధిని నివారించడంలో సహాయపడతాయి. పాదాల వాపు, పొత్తికడుపులో వాపు, కళ్ళు లేదా గోర్లు పసుపు రంగులోకి మారడం, ఆకలి లేకపోవడం, చిన్న గాయమైతే ఎక్కువ రక్తస్రావం కావడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఊబకాయంతో బాధపడేవారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, హెపటైటిస్ బి, సి పేషెంట్లు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఆల్కహాల్ ఎక్కువగా తాగే వారికి కూడా సిర్రోసిస్ సులువుగా వస్తుంది. కానీ ఈ రోజుల్లో ఊబకాయంతో బాధపడేవారికి ఈ వ్యాధి ఎక్కువగా సోకుతోంది. వైద్య సలహా లేకుండా పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్ వాడే వారికి కూడా లివర్ సిర్రోసిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.