చాలా మంది పంచదారకు బదులుగా బెల్లం ఉపయోగిస్తుంటారు. కాఫీ, టీల్లో పంచదారకు బదులు బెల్లం వేయడం వేయడం వల్ల ఆరోగ్యదాయకమే కాకుండా రుచి కూడా ప్రత్యేకంగా ఉంటుంది
బెల్లం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, జ్వరం లాంటి సాధారణ అనారోగ్యాలను అరికడుతుంది. ఊబకాయాన్ని నిరోధిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు తగిన మోతాదులో బెల్లం తీసుకుంటూ ఉండాలి
TV9 Telugu
ఎముకలు, దంతాలు పటిష్టంగా ఉంటాయి. కాస్త అల్లం నూరి.. అందులో బెల్లం చేర్చి తీసుకుంటే కీళ్లనొప్పులు, నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది
TV9 Telugu
ఉబ్బసం, ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడం లాంటి శ్వాస సమస్యలను తగ్గిస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలో చేరిన మలినాలను బయటకు పంపేస్తుంది. కాలేయానికి మేలు చేస్తుంది
TV9 Telugu
బెల్లం తినడం వల్ల జీర్ణప్రక్రియ సాఫీగా ఉంటుంది. అన్నం తిన్నాక కాస్త బెల్లం ముక్క తినడం అలవాటు చేసుకుంటే కడుపుబ్బరం, మలబద్ధకం లాంటి ఇబ్బందులు రావు
TV9 Telugu
కొందరు రిఫ్రిజిరేటర్‌లో బెల్లం నిల్వ చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల దాని నాణ్యత ప్రభావితం అవుతుంది. అది జిగటగా మారి, బూజు పట్టే అవకాశం ఉంది
TV9 Telugu
బెల్లం నిల్వ చేయడానికి ఉత్తమ మార్గం తేమ నుంచి రక్షణ కల్పించడం. ఇందుకోసం గాలి చొరబడని కంటైనర్‌లో బెల్లం నిల్వ చేయాలి