కోటి రూపాయల ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కథ కంచికేనా?
హర్యానాలో HR88B8888 ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కోసం రూ.1.17 కోట్లు బిడ్ వేసిన సుధీర్ కుమార్ డబ్బు చెల్లించడంలో విఫలమయ్యారు. దీనిపై రవాణా శాఖ మంత్రి అనిల్ విజ్ తీవ్రంగా స్పందించారు. బిడ్డర్ ఆస్తులపై విచారణకు ఆదేశించారు, ఐటీ శాఖకు కూడా లేఖ రాయనున్నట్లు తెలిపారు. సాంకేతిక సమస్యలు, కుటుంబ సభ్యుల అసమ్మతిని సుధీర్ కుమార్ కారణాలుగా పేర్కొన్నారు. ఈ నంబర్ ప్లేట్ మళ్లీ వేలానికి రానుంది.
హర్యానాలో ‘HR88B8888’ అనే నంబర్ ప్లేట్‌కు ఆన్‌లైన్‌లో వేలం జరిగింది. రూ.50,000 కనీస ధరతో ప్రారంభమైన ఈ వేలంలో రోములస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అయిన సుధీర్ కుమార్ అత్యధికంగా రూ.1.17 కోట్లకు బిడ్ దాఖలు చేసి దక్కించుకున్నారు. అయితే, ఈ నెల 1వ తేదీతో డబ్బు చెల్లించేందుకు గడువు ముగిసినా ఆయన స్పందించలేదు. కేవలం రూ.11,000 సెక్యూరిటీ డిపాజిట్‌ను వదులుకున్నారు. ఈ వ్యవహారంపై హర్యానా రవాణా శాఖ మంత్రి అనిల్ విజ్ తీవ్రంగా స్పందించారు. “వేలంలో పాల్గొనడం ఓ హాబీ కాదు, అదొక బాధ్యత. ఆర్థిక స్థోమత లేకుండా వేలంలో ధరలను పెంచే వారిని నిరోధించడానికే ఈ చర్యలు తీసుకుంటున్నాం. సుధీర్ కుమార్ ఆస్తులపై విచారణ జరిపి, అవసరమైతే ఆదాయపు పన్ను శాఖకు కూడా లేఖ రాస్తాం” అని ఆయన స్పష్టం చేశారు. హర్యానాలో ఓ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌ను రికార్డు స్థాయిలో రూ.1.17 కోట్లకు వేలంలో గెలుచుకుని, ఆ తర్వాత డబ్బు చెల్లించడంలో విఫలమైన వ్యక్తిపై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బిడ్డర్ ఆస్తులు, ఆదాయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని రవాణా శాఖను ఆదేశించినట్లు మంత్రి అనిల్ విజ్ తెలిపారు. మరోవైపు సుధీర్ కుమార్ స్పందిస్తూ.. సాంకేతిక సమస్యల వల్ల డబ్బు జమ చేయలేకపోయానని తెలిపారు. ఒక నంబర్ ప్లేట్ కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి తన కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదని, వారితో చర్చిస్తున్నట్లు చెప్పారు. అధికారులు మాత్రం ఈ నంబర్ ప్లేట్‌ను మళ్లీ వేలానికి ఉంచనున్నట్లు ప్రకటించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పేదల ఊటీ.. మన సిక్కోలు మూడు రోజులుగా ఆహ్లాద వాతావరణం
మరీ.. పిన్నీసుతో ఎలారా బాబు.. ఇవి మరీ అంత వీకా..
పదిహేనేళ్ల నిరీక్షణ ఫలితం.. రూ.61 కోట్లు
కోటి రూపాయల ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కథ కంచికేనా?
మెట్రో రైలు .. ట్రాక్‌పై నడిచిన ప్రయాణికులు
డిగ్రీ కన్నా నేర్చుకోవాలనే ఆసక్తి ముఖ్యం..
పేదల ఊటీ.. మన సిక్కోలు మూడు రోజులుగా ఆహ్లాద వాతావరణం
మరీ.. పిన్నీసుతో ఎలారా బాబు.. ఇవి మరీ అంత వీకా..
పదిహేనేళ్ల నిరీక్షణ ఫలితం.. రూ.61 కోట్లు
11 ఏళ్ల చిన్నారి చిరుతతో పోరాటం.. అదే అతనికి రక్షణ కవచమైంది

